Breaking : మరో లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన

పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ అధినేత ఖరారు చేశారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.

Breaking : మరో లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
New Update

BRS : హైదరాబాద్(Hyderabad) లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్(Gaddam Srinivas Yadav) పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఖరారు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ ఎంపీ సీటును పెండింగ్ లో ఉంచారు. తాజాగా ఈ రోజు ఆ స్థానానికి సైతం అభ్యర్థిని ఫైనల్ చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు(Lok Sabha Seats) బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.

బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులు వీళ్లే..

1. నాగర్‌కర్నూల్‌(ఎస్సీ)- ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

2. పెద్దప‌ల్లి(ఎస్సీ)- కొప్పుల ఈశ్వర్

3. వ‌రంగ‌ల్(ఎస్సీ)- క‌డియం కావ్య

4. మ‌హ‌బూబాబాద్(ఎస్టీ) - మాలోత్ క‌విత‌

5. ఆదిలాబాద్(ఎస్టీ)- ఆత్రం స‌క్కు

6. మెదక్‌ - వెంకట్రామిరెడ్డి

7. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్- మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి

8. క‌రీంన‌గ‌ర్- బోయినపల్లి వినోద్ కుమార్

9. జ‌హీరాబాద్- గాలి అనిల్ కుమార్

Also Read : Revanth Reddy : సొంత జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్

10. ఖ‌మ్మం- నామా నాగేశ్వర్ రావు

11. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

12. మ‌ల్కాజ్‌గిరి- రాగిడి ల‌క్ష్మారెడ్డి

13. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవ‌ర్ధన్

14. భువనగిరి- క్యామా మల్లేష్

15. నల్గొండ- కంచర్ల కృష్ణారెడ్డి

16. సికింద్రాబాద్- తీగుళ్ల పద్మారావుగౌడ్‌

17. హైదరాబాద్-గడ్డం శ్రీనివాస్ యాదవ్

జహీరాబాద్, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల జనరల్ సీట్లను బీసీలకు కేటాయించింది బీఆర్ఎస్. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో బీసీలకు టికెట్లు కేటాయించిన పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలలో ఖమ్మం-నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్  నుంచి మాలోత్ కవితకు మరో సారి అవకాశం దక్కింది.

#brs #kcr #lok-sabha-seats #gaddam-srinivas-yadav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe