BRS Party: 100 రోజుల్లో వంద తప్పులు.. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనపై బీఆర్ఎస్ పార్టీ విమర్శల దాడికి దిగింది. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పేర్కొంది. 100 రోజుల్లో కాంగ్రెస్ చేసిన వంద తప్పులను వివరించింది. By V.J Reddy 17 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలన పై బీఆర్ఎస్ పార్టీ విమర్శల దాడికి దిగింది. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పేర్కొంది. 100 రోజుల్లో కాంగ్రెస్ చేసిన వంద తప్పులను వివరించింది. ALSO READ: ఎమ్మెల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు బీఆర్ఎస్ ఎత్తి చూపిన 100 తప్పులు.. 1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ? 2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు ? 3. రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు ? 4. వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది ? 5. ప్రతి మహిళకు రూ.2500 హామీ మరిచిపోయారా ? 6. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000 కు ఎందుకు పెంచలేదు ? 7. ఒకటో తేదీన జీతాలన్నారు. అందరికీ ఎందుకు అందడం లేదు ? 8. 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి ? 9. గృహజ్యోతికి ఏటా 8 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2400 కోట్లే ఎందుకు పెట్టారు ? 10. దళితబంధు పథకాన్ని అర్థాంతకరంగా ఎందుకు నిలిపివేశారు ? 11. అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు ? 12. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్‌కు వెళ్లి.. ఆ తరువాత ఎందుకు ముఖం చాటేశారు ? 13. చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేశారు ? 14. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు ? 15. భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు ? 16. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లివ్వకపోవడం ఘోరం కాదా ? 17. పదేళ్ల తరువాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా? 18. వేళాపాళా లేని కోతలు, కరెంట్ షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు ? 19. సమైక్యరాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా ? 20. పంజాబ్‌ను తలదన్నిన తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా ఎందుకు మార్చారు ? 21. యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి ? 22. వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారు ? 23. బోర్ల రాంరెడ్డి ఎదుర్కొన్న ఆనాటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎందుకొచ్చింది ? 24. పల్లెలు పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు ? 25. నాణ్యత లేని కరెంట్ వల్ల కాలిపోతున్న మోటర్లకు బాధ్యులెవరు ? 26. మళ్లీ యూరియా కోసం క్యూలైన్ లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు ? 27. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు ? 28. మిషన్ భగీరథను మూలనపడేసి.. మళ్ళీ ట్యాంకర్ల రాజ్యమా ? 29. ఫ్రీ బస్సు అని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా ? 30. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా ? 31. పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు ? 32. ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు ? 33. ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతన్నలను అవమానిస్తారా ? 34. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి చేస్తారా ? 35. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులను మీ ఖాతాలో వేసుకుంటారా ? 36. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ చెన్నైకి తరలిపోతున్నా గుడ్లప్పగించి చూస్తారా ? 37. కేన్స్ సెమీ కాన్ సంస్థను గుజరాత్ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తారా ? 38. ప్రపంచం మెచ్చిన టీఎస్ ఐపాస్‌ను కాదని.. కొత్త పాలసీ పాటపాడతారా ? 39. గురుకుల నియామకాల్లో వెయ్యి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలడం మీ వైఫల్యంకాదా ? 40. పచ్చని వికారాబాద్ అడవులపై రాడార్ చిచ్చు పెడతారా ? 41. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెరతీస్తారా ? 42. శంషాబాద్ మెట్రోను ముందుచూపు లేకుండా ఎలా రద్దుచేస్తారు ? 43. దేశానికే తలమానికం లాంటి ఫార్మా సిటీని ముక్కలు చేస్తారా ? 44. కల్యాణలక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది ? 45. Free LRS పై మాటతప్పి ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకుంటారా ? 46. రక్షణ భూముల అప్పగింతలో బీఆర్ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా ? 47. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు పాతరేసి ఆ రూట్‌లో శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా ? 48. గొర్రెల పథకం లబ్దిదారులు డీడీలు కట్టినా ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు ? 49. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని ఇంకెప్పుడు పూర్తి చేస్తారు ? 50. సాక్షాత్తు ప్రియాంకా గాంధీ హామీఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది ? 51. కేసిఆర్ కిట్ - రూ.13 వేల ఆర్థిక సాయాన్ని ఇస్తారా ? లేదా ? 52. గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ పథకం ఏమైంది ? 53. వెంటనే తెల్ల కార్డులను అందిస్తామన్న హామీ అమలు ఇంకెప్పుడు ? 54. విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ఎందుకు బ్రేకులు వేశారు ? 55. ధరణి పోర్టల్‌ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనా ? 56. ధూపదీప నైవేద్యం పథకాన్ని కొండెక్కించడం సమంజసమేనా ? 57. 33 జిల్లాలను కుదించాలని కుట్ర చేయడం తిరోగమన చర్య కాదా ? 58. వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేయడం తప్పు కాదా ? 59. సొంత ప్రభుత్వంలోని దళిత ఉపముఖ్యమంత్రిని అవమానిస్తారా ? 60. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు ? 61. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన 30 వేల ఉద్యోగాల భర్తీని మీ ఖాతాలో వేసుకుంటారా ? 62. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లలో నష్టపరుస్తారా ? 63. ఉద్యోగాలకు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి.. ఫీజు వసూలు చేస్తారా ? 64. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న పెండింగ్ డిఏలు ఇంకెప్పుడు ఇస్తారు ? 65. మూడు నెలలుగా పీహెచ్ సీల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి జీతాలు ఇవ్వరా ? 66. 38 మందికి పైగా ఆటోడ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు మీరు కాదా ? 67. 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా ? 68. సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలకు తెరతీసింది మీరు కాదా ? 69. గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా ? 70. పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్‌లకు పాలన అప్పగిస్తారా ? 71. అప్పు చేయడం తప్పు అని.. మీరే వేల కోట్ల రుణాలు ఎలా తీసుకుంటారు ? 72. అధికారంలోకి రాగానే మళ్లీ ఇసుక మాఫియాకు దారులు తెరిచారా ? 73. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా ? 74. సచివాలయం ముందు తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు ? 75. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తారు ? 76. జై తెలంగాణ అని నినదించిన పాపానికి లాఠీలతో రెచ్చిపోతారా ? 77. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న బీజేపీతో చీకటి ఒప్పందాలెందుకు ? 78. గుజరాత్ మోడల్‌ను మెచ్చుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా ? 79. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు తెలంగాణను ఏటీఎంగా మార్చేశారా ? 80. పరిపాలనను గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారా ? 81. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి ఇంకెన్ని అక్రమ కేసులు పెడతారు ? 82. పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా మార్చింది మీరు కాదా ? 83. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండని అన్నదాతలను అవమానిస్తారా ? 84. కౌలు రైతులకు ఎకరానికి 15 వేల హామీని ఇంకెప్పుడు నిలబెట్టుకుంటారు ? 85. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న మాట మరిచిపోయారా ? 86. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అడ్రస్ ఎక్కడ ? 87. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాల హామీని గాలికి వదిలేశారా ? 88. సాగునీరు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా.. నష్టపరిహారం అందించరా ? 89. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడిస్తారు ? 90. యూత్ కమిషన్ ఏర్పాటు - రూ.10 లక్షలు వడ్డీ లేని రుణ హామీ ఏమైంది ? 91. తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారా ? 92. ఎస్సీ విద్యార్థులకు ఇస్తామన్న విద్యా జ్యోతులు పథకం గుర్తుందా ? 93. పవర్ లూమ్స్, ఇతర పరికరాలపై 90 శాతం సబ్సిడీ గ్యారెంటీ ఏమైంది ? 94. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసేదెప్పుడు ? 95. మైనిఫెస్టోలో రూ.1.70 లక్షల కోట్ల హామీలిచ్చి.. బడ్జెట్‌లో నిధులు కేటాయించరా ? 96. పదేళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని వందరోజుల్లోనే దెబ్బతీస్తారా ? 97. ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చిన ఐదు డిక్లరేషన్లను మీరే కాలరాస్తారా ? 98. బాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తారా ? 99. విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై అంత ప్రేమ ఎందుకు ? 100. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా ? #kcr #cm-revanth-reddy #brs-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి