BRS Party : కేసీఆర్ చెప్పిందే జరిగింది.. బీఆర్ఎస్ పార్టీ సంచలన పోస్ట్

TG: సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్దతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ చెప్పిందే జరిగిందని బీఆర్ఎస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి చూపారని పేర్కొంది.

New Update
KCR: సీఎం రేవంత్‌పై ఈడీ, ఐటీ విచారణ జరపాలి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

BRS Party Interesting Post On Central Budget : సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం (Central Government) ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్ధతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేసింది. 16 ఎంపీలు సంకీర్ణానికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవ్వాళ అమరావతికి రూ. 15 వేల కోట్లు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్దికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సాధించిందని చెప్పింది.

12 ఎంపీలతో కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్‌ (Bihar) లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందిందని పేర్కొంది. కానీ, నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారని తెలిపింది. ఇవ్వాళ తెలంగాణ సొంత పార్టీకి పన్నెండో-పదిహేనో ఎంపీలు ఉండుంటే అనేక ఏళ్లుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల్లో ఏవి వచ్చుండేవి? అంటూ పేర్కొంది.

Also Read : ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు



#telangana #kcr #brs-party
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు