Telangana : బీఆర్‌ఎస్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి

నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు.

Telangana : బీఆర్‌ఎస్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి
New Update

BRS : నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి(Anugula Rakesh Reddy) ని పార్టీ అధినేత కేసీఆర్(KCR) ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు. గతంలో జరిగిన గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో పల్లా.. జనగామా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.

Also Read: టెట్‌ పరీక్షలు రీషెడ్యూల్.. కొత్త తేదీలివే!

అయితే ఇప్పటికే ఈ బై ఎలక్షన్ నోటిఫికేషన్(Bi Election Notification) విడుదలైంది. ఈరోజు నుంచి మే 9వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఇక ఈ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ మే 27న జరగనుంది. మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Also Read: అమిత్‌ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే..

#telugu-news #telangana #mlc #anugula-rakesh-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe