/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-30-6.jpg)
MLC Kavitha: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్నారు బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అయితే ఇంట్లోకి వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన కవిత.. 'నేను ఏ తప్పు చేయలేదు. ఈ కేసు అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాననే విశ్వాసం నాకుంది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటాం. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. ధర్మమే గెలిచి తీరుతుంది. నాకు మద్ధతుగా నిలిచిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ' అంటూ ఇంట్లోకి వెళ్లారు కవిత.