KTR : కవితను కలవనున్న కేటీఆర్, హరీష్! ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలవనున్నట్లు తెలుస్తోంది. కవితను కలిసేందుకు సమయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దారించడంతో రేపు సాయంత్రం భర్త అనిల్‌తో కలిసి కేటీఆర్, హరీష్ రావు కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. By V.J Reddy 16 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KTR to Meet MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన కవిత ను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు మాజీ మంత్రు కేటీఆర్, హరీష్ రావు (Harish Rao). ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సమయం సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దారించింది. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కలిసేందుకు అవకాశం కల్పిచింది. ఈ క్రమంలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో (KTR) పాటు హరీష్ రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీశ్‌రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ALSO READ: బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా కవిత భర్తకు ఈడీ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె భర్తకు ఈడీ (ED) నోటీసులు పంపింది. సోమవారం రోజు ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ సహా మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా నలుగురు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు.. తెలంగాణలో కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. లోక్ సభ ఎన్నికలకు ముందు లబ్ధి పొందేందుకే తమ పార్టీ నాయకురాలైన కవిత పై తప్పుడు ఆరోపణలు చేసి.. కేసులు పెట్టి.. అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడంలో అర్థం ఏంటనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా కోర్టులో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండు పార్టీలు కలిసి కేసీఆర్ పేరు బద్నామ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. కవిత అరెస్ట్ కు నిరసనగా శనివారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. #ktr #mlc-kavitha #harish-rao #delhi-liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి