Danam Nagender : టార్గెట్ దానం నాగేందర్.. యాక్షన్ మొదలుపెట్టిన బీఆర్ఎస్!

తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందనపై సంతృప్తి చెందకపోతే.. ఈ విషయంపై బీఆర్ఎస్ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం ఉంది.

Danam Nagender : టార్గెట్ దానం నాగేందర్.. యాక్షన్ మొదలుపెట్టిన బీఆర్ఎస్!
New Update

BRS : కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే దానం నాగేందర్ పై(Danam Nagender) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ లేఖ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) మాట్లాడుతూ.. ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని విమర్శించిన విషయాన్ని కూడా కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: Telangana: ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు

ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకుని అదే బీడీలు అమ్మిస్తారా? అంటూ ప్రశ్నించారు. పార్టీ మారిన వారిపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రస్తావించారు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడవద్దని కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. తాము ఒక అడుగు వెనకడుగు వేశాం.. అంటే నాలుగు అడుగులు ముందు కు వేస్తామన్నారు. ఒక దెబ్బ మీరు కొట్టారని.. తాము మరో దెబ్బ కొట్టడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు.

బీఆర్ఎస్ అలర్ట్..

చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్(Congress) లో చేరుతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఫిరాయించిన దానంపై ఫిర్యాదు చేస్తే.. ఇతర ఎమ్మెల్యేల్లోనూ భయం ఉంటుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్న ఎమ్మెల్యేలను హైకమాండ్ పెద్దలు కలిసి చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ బీఆర్ఎస్ దేనని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నారు.

మరికొందరు ఎమ్మెల్యేలు కూడా..

ఇన్నాళ్లు ఎమ్మెల్యేల చేరికలపై సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసింది. ఖైరతాబాద్(Khairtabad) బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకుంది. గ్రేటర్ పరిధిలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

#telangana #mla-danam-nagender #padi-kaushik-reddy #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe