MLA Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కీలక ప్రకటన

TG: బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. కాగా నిన్న సీఎం రేవంత్‌తో ప్రకాష్ భేటీ కావడంతో పార్టీ మారుతారని చర్చకు బలాన్ని చేకూర్చింది.

New Update
MLA Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిక.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కీలక ప్రకటన

BRS MLA Prakash Goud: బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని తేల్చి చెప్పారు. కాగా నిన్న సీఎం రేవంత్ తో ప్రకాష్ భేటీ కావడం పార్టీ మారుతారని చర్చకు బలాన్ని చేకూర్చింది. కాగా ఈరోజు తన కేడర్ తో సమావేశమైన ప్రకాష్ గౌడ్.. తాను పార్టీ మారడం పై తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. తాను పార్టీ మారడంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని అన్నారు.

తాత్కాలికం అంటే.. జంపేనా?

రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అటు కేసీఆర్ ను, ఇటు రేవంత్ రెడ్డిని గందరగోళంలోకి నెట్టేశాయి. ఇందుకు ప్రధాన కారణం పార్టీ మారడంపై  తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు చెప్పడమే. చెప్పకనే తాను బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తానని చెబుతున్నారా? లేదా? కేసీఆర్ వెంటే ఉంటానని అంటున్నారా? అనే ధర్మ సందేహంలో రాజేంద్రనగర్ ప్రజలు, ఇటు బీఆర్ఎస్ నేతలు, అటు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే చెప్పిన దానిని అర్ధం చేసుకోలేక తలపట్టుకున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కేసీఆర్ కు నేతలు పార్టీని వీడడం ఒక్కప్పుడు తలనొప్పిగా మారిన.. ఇప్పుడు అలవాటు అయిందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తుది నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు