BRS MLA Prakash Goud: తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: చిక్కుల్లో కేటీఆర్, హరీష్ రావు.. ఏం జరగనుంది?
అందుకోసమే వచ్చా..
తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలపై స్పందించారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ ముఖ్య మంత్రి అయినందుకురేవంత్ రెడ్డి ని కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ ను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ భూ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు.
అప్పుడు నలుగురు..
సీఎం రేవంత్ రెడ్డితో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) , మాణిక్ రావు (జహీరాబాద్) సమావేశం అయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకు భేటీ అయ్యారనే దానిపై ప్రజల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తాయి.
ఆనాడు మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా..
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తాము త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని పుకార్లు వస్తున్నాయని వాటిని నమ్మవద్దని అన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే (BRS Party) కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తమ నియోజక వర్గ సమస్యలు చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
DO WATCH: