MLA KTR : జాబ్ లెస్ క్యాలెండర్ గురించి వివరణ ఇవ్వండి.. రాహుల్‌కు కేటీఆర్ ట్వీట్ TG: జాబ్ క్యాలెండర్‌పై రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు కేటీఆర్. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పకుండా జాబ్ లెస్ క్యాలెండర్‌ను విడుదల చేసిందన్నారు. దీనిపై అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగాలకు రాహుల్ వివరణ ఇవ్వాలన్నారు. By V.J Reddy 03 Aug 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR Tweets Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో మీరు తెలంగాణలో పర్యటించిన మీరు అధికారంలోకి రాగానే మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని.. మీ మాటలు నిజమని నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ పగ్గాలను అప్పగించారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ నిరాశే మిగిల్చిందని చెప్పారు. తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ (Job Notification) కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఎన్నో చెప్పకుండా జాబ్ లెస్ క్యాలెండర్ ను విడుదల చేసే నిరుద్యోగుల ఆశలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు వచ్చి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో వారికి వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. Hello @RahulGandhi Ji, The youth of Telangana had believed your words on “2 lakh govt jobs in 1 year” & voted for Congress Now after 8 months, the youth is agitating as Zero jobs have been delivered & a “jobless” calendar issued Why don’t you come back to Ashok Nagar,… https://t.co/LJbagV2Kka — KTR (@KTRBRS) August 3, 2024 Also Read : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్ బృందం #brs #congress #rahul-gandhi #mla-ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి