MLA KTR: రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా?.. కేటీఆర్ సెటైర్లు TG: రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా? లేదా బీజేపీకి చెందిన ఎంపీనా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాముడు అందరికి దేవుడే అని అన్నారు. రాముడిని దేశానికి తామే పరిచయం చేసినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. By V.J Reddy 28 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: తెలంగాణలో రాజకీయాలు రిజర్వేషన్లు రద్దు, రాముడి చుట్టూ తిరుగుతున్నాయి. వేములవాడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల దాడికి దిగారు. లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అంటోందని అన్నారు కేటీఆర్. ఇలాంటి అరాచకాలను అడ్డుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ALSO READ: రిజర్వేషన్లు రద్దు… అమిత్ షా హాట్ కామెంట్స్ రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా? లేదా బీజేపీకి చెందిన ఎంపీనా? అని చురకలు అంటించారు. రాముడు అందరికి దేవుడే అని అన్నారు. రాముడిని దేశానికి తామే పరిచయం చేసినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ లేకపోతే హిందువులు అసలు బొట్టే పెట్టుకోరనే విధంగా బీజేపీ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. వేములవాడ రాజన్న ఆలయానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి అన్న తెచ్చావా? అని కరీంనగర్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు. గత ఐదేళ్లు ఎంపీ గా ఉన్న నువ్వు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బండి సంజయ్ కు సవాల్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన చోటేభాయ్ (సీఎం రేవంత్ రెడ్డి) ప్రజలను మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో మొత్తం 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని.. ఇప్పుడు కేవలం ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని అన్నారు. 2014లో బడా భాయ్ (ప్రధాని మోడీ) దేశ ప్రజలను మోసం చేశారని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని.. కానీ దేశంలో రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. #brs #congress #bjp #mla-ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి