Kavitha: కవిత బెయిల్‌పై కేటీఆర్ సంచలన రియాక్షన్.. ఏమన్నారంటే ? మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 27 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kavitha Bail: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత, ఈడీ తరఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఎట్టకేలకు కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. Also Read: షరతులు లేని రుణమాఫీ చేయాలి.. మంత్రి తుమ్మలను అడ్డుకున్న రైతులు ఇదిలాఉండగా.. ఈరోజు సుప్రీంకోర్టులో కవిత విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరఫున వాదనలు వినిపించే న్యాయవాదితో సంప్రదింపులు జరిపారు. చివరికీ కవితకు బెయిల్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఇప్పటికే అనేకసార్లు ఆమె విచారణ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఆమెకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. Also Read: పాస్‌పోర్ట్ ఇచ్చేయాలి.. అలా అస్సలు చేయొద్దు.. కవిత బెయిల్ కండీషన్లు ఇవే! Thank You Supreme Court 🙏 Relieved. Justice prevailed — KTR (@KTRBRS) August 27, 2024 Post bail scenes- KTR & Harish Rao https://t.co/RPtVaFgaUV pic.twitter.com/hn5jDqdzEn — Naveena (@TheNaveena) August 27, 2024 ఎమ్మెల్సీ కవిత బెయిల్ తర్వాత సుప్రీంకోర్టు బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు pic.twitter.com/It0Ch3JOBi — Telugu Scribe (@TeluguScribe) August 27, 2024 #brs #ktr #mlc-kavitha #delhi-liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి