Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో మభ్యపెట్టింది: హరీష్ రావు

TG: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు.

New Update
Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో మభ్యపెట్టింది: హరీష్ రావు

Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ (Congress) ఎన్నికల్లో మభ్యపెట్టిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని అన్నారు. రుణమాఫీకి (Rythu Runa Mafi) విధించిన గడువు తేదీ అసమంజసం అని చెప్పారు. డిసెంబర్‌12, 2018కు ముందు రుణమాఫీ వర్తించదనడం సరికాదని అన్నారు.

హరీష్ రావు ట్విట్టర్ (X)లో.. "రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది.

డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నది. ఆహార భద్రత కార్డు, పిఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే ఎన్నికలప్పుడు మభ్య పెట్టారు, అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారు." అంటూ రాసుకొచ్చారు.

Also Read: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద హై టెన్షన్.. నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు