Harish Rao : బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‌ను మించిపోయారంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కవమంది గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని అన్నారు. By B Aravind 11 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS - Congress : బీజేపీ(BJP) ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పెద సామాన్య ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శలు చేశారు. ఏకంగా రూ.14 లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. పేద ప్రజల నడ్డివిరిస్తూ నిత్యావసర ధరలు పెంచిందని ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్(Karimnagar) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బొయినపల్లి వినోద్‌కుమార్‌కు ఆయన మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్నారు. Also Read: ఆయన నా గురువు కాదు.. సహచరుడు.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీ విధానాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల బొమ్మలు పంపిణీ చేసి ఓట్లు అడుగుతున్న బీజేపీకి ఓటు వేస్తే కడుపు నిండదని అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టింది బీజేపీ కాదని.. ప్రజల విరాళాలతోనే ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డిని మించిపోయారన్నారు. ఇటీవల జరిగిన సభల్లో మహిళలకు రూ.2500 ఇచ్చామని చెప్పారని సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కవమంది గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని.. వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలించాలని పిలుపునిచ్చారు. Also Read: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం #telugu-news #lok-sabha-elections #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి