Telangana: కొత్త జీవో వల్ల రాష్ట్ర విద్యార్థులే స్థానికేతరులవుతున్నారు : హరీష్ రావు

MBBS ప్రవేశాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 వల్ల రాష్ట్ర విద్యార్థులే స్థానికేతరులు అవుతున్నారని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. స్థానిక విద్యార్థుల కోసం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

MLA Harish Rao: పవర్‌ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్
New Update

MBBS ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త ఉత్తర్వుల వల్ల రాష్ట్ర విద్యార్థులకే అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవడం లేదని విమర్శించారు. కొత్త ఉత్తర్వులతో రాష్ట్ర విద్యార్థులే స్థానికేతరులు అవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెంచామని.. బీ కేటగిరి సీట్లు కూడా రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో స్థానిక విద్యార్థుల కోసం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Also Read: ఇకనుంచి ఓపీ కోసం వేచిచూడాల్సిన పని లేదు.. క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌

#telugu-news #telangana-news #harish-rao #mbbs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe