Harish Rao: రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు అత్యాచారాలా ? హరీష్‌ రావు ఫైర్‌

రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరమని.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Harish Rao: రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు అత్యాచారాలా ? హరీష్‌ రావు ఫైర్‌
New Update

రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు బాధ్యత కరువైందని రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఈ ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరం. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణం. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం.

Also Read: బయటపడుతున్న మరిన్ని అక్రమాలు.. మేఘా కృష్ణారెడ్డికి NHAI బిగ్‌ షాక్‌..

1.వనస్థలీపురం పిఎస్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం
2.ఓయూపిఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం
3.నల్లగొండ జిల్లా శాలిగౌరారం లో దివ్యాంగ మహిళపై అత్యాచారం
4.నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్

అత్యాచార బాధితులను భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని' హరీష్ రావు పేర్కొన్నారు.

#telangana-news #harish-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe