Harish Rao: అసెంబ్లీకి రా చూసుకుందాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్

సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్‌ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. రేవంత్‌కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Harish Rao: అసెంబ్లీకి రా చూసుకుందాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్
New Update

Harish Rao: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్ (Congress Party) ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల (BRS Party) మధ్య సాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొన్నది. కృష్టనదిపై (Krishna River) ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కారు కేంద్రానికి (Central Government) అప్పగించిందని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రాజెక్టులను హ్యాండోవర్ చేసింది కేసీఆరే (KCR) ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి మాజీ మంత్రి హరీష్ కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

ALSO READ: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించ లేదు. నీటిలో యాభై శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టాం.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను అప్పగించి సంతకం పెట్టింది. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టింది. రేవంత్ దగ్గర విషయం లేదు కనుకే విషం చిమ్ముతున్నాడు. రేవంత్ నీ అతి తెలివి బంద్ చేయి. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? బిల్లును తయారుచేసింది మీ జైపాల్ రెడ్డి, జైరాం రమేశ్ కాదా? రేవంత్‌కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి నీటి సమస్యలను తీసుకొస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు.

ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగిస్తే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్‌లకు సాగు నీరు, తాగునీటికి సమస్య వస్తుంది. హైదరాబాద్‌కు మంచినీటి సమస్య వస్తుందన్నారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదు. ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై స్పందించలేదు. పెదవులు మూతపడ్డాయి. రేవంత్.. నీ వీపు చూసుకుని మాట్లాడు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే అన్నారు.

పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశాం. ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లా మీ ముఖాన విసిరేసిన చరిత్ర మాది. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్య నాయుడు ఉదయం రేవంత్‌కు చెప్పారు. రేవంత్ మధ్యాహ్నాం చిల్లర మాటలు మాట్లాడారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెట్టు, నీకు దిమ్మతిరిగే సమాధానం చెప్తాం బిడ్డా. మేం గతంలో చర్చ పెడితే ప్రిపేర్ కాలేదని కాంగ్రెస్ తప్పించుకుంది. మేం అలా కాదు, ధైర్యంగా చర్చకు వస్తాం.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారు. అని దుయ్యబట్టారు.

DO WATCH:

#krmd #congress-party #harish-rao #cm-reavanth-reddy #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe