/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bandla-Krishna-Mohan-Reddy.jpg)
Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్ పార్టీకి వరుస నేతల రాజీనామాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లోకి గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే (Gadwal BRS MLA) కృష్ణమోహన్ రెడ్డి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మంత్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణమోహన్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్యే పార్టీ మార్పుతో పాలమూరు జిల్లాలో ఒక్క నియోజకవర్గానికే పరిమితం కానుంది బీఆర్‌ఎస్. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు ఆరుగురు ఎమ్మెల్యేలు. కాగా కృష్ణమోహన్ రెడ్డి చేరికను జడ్పీ ఛైర్మన్ సరిత వర్గం వ్యతిరేకిస్తోంది.