Malla Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో బాంబ్ పేల్చారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సంచలన విషయాలు బయట పెట్టారు. బీజేపీతో (BJP) బీఆర్ఎస్ (BRS) పొత్తు ఉండే అవకాశం ఉందని అన్నారు. పొత్తులో భాగంగా మల్కాజ్‌గిరి (Malkajgiri MP Ticket) ఎంపీ టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి భద్రంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA's) ఏ పార్టీతో టచ్ లో లేరని స్పష్టం చేశారు. అందరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు.
గతంలోనూ ఇదే తరహాలో..
గతంలో కూడా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేకుండా చేసే వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) బీఆర్ఎస్ ఎంపీ (BRS MP) వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ కోసం రంజిత్‌రెడ్డి (MP Ranjith Reddy) కర్చీఫ్ వేస్తున్నారని ఆరోపణలు చేశారు. రంజిత్‌రెడ్డి ప్రయత్నాలు తెలిసి పట్నం మహేందర్ రెడ్డి అలర్ట్ అయ్యారని అన్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే మహేందర్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారని ఊహించాని ట్విస్ట్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరిగేది తెలియదని అన్నారు. ఎవరు ఏ పార్టీలోకైన వెళ్ళవచ్చు అని పేర్కొన్నారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి ఇంకా స్పందించకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీస్తోంది.
ALSO READ: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి నలుగురు నేతలు
కొడుక్కి తానే టికెట్ ప్రకటించాడు!
తెలంగాణ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచిన.. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం కుంగిపోకుండా రాబోయే లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections) వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి (Bhadra Reddy) మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. కేసీఆర్ కూడా తన కొడుక్కి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఫిక్స్ అయినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించక ముందే మల్లారెడ్డి (Malla Reddy) ఈ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయతీకి తెర లేపినట్లయింది.