KTR: నిరుద్యోగ భృతి లేదు.. కాంగ్రెస్‌‌పై కేటీఆర్, కడియం ఫైర్!

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోడానికి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఆరు గ్యారెంటీల అమలుకు 100 రోజుల సమయానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని పేర్కొన్నారు.

New Update
KTR: ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయి...కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పై కేటీఆర్‌!

Congress Six Guarantees: తాము నిరుద్యోగ భృతి ఇస్తామని అనలేదని.. కేవలం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను విస్మరిస్తోందని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!

అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని మాట మార్చారని చురకలు అంటించారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. మరీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయిన ఎందుకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. ప్రతి క్వింటాల్‌కు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారని.. ఇచ్చిన హామీలను ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోందని విమర్శలు చేశారు.

ఇది శ్వేతపత్రం కాదు, ప్రచార యంత్రం.. కేటీఆర్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విడుదల శ్వేతపత్రంపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఇది శ్వేతపత్రం కాదు, ప్రచార యంత్రం ద్వారా నడపబడే అబద్ధాలు, తప్పుడు సమాచారంతో నిండిన పత్రం అని మండిపడ్డారు. అత్యంత విజయవంతమైన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించినందుకు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అవమానం అని అన్నారు. కాంగ్రెస్ ఎజెండాకు సరిపోయేలా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలను కలపడం, అస్పష్టం చేయడానికి ప్రయత్నించడం మీ కపటత్వాన్ని కప్పిపుచ్చుకోదు అని మండిపడ్డారు. 'మీరు చెబుతున్నట్లుగా రాష్ట్రం కష్టాల్లో ఉంటే, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో కొత్త క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారు? న్యూఢిల్లీలో తెలంగాణ భవన్‌ ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు? 100 రోజుల్లో ఆరు హామీలు నెరవేర్చడం మీ ప్రాధాన్యత ఎందుకు కాదు?,100 రోజుల నోటీసుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది.' అంటూ విమర్శలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు