TS: బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. 'వాళ్ల మాటలకు విలువ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయకుండా ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం అత్యంత దురదృష్టకరం'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update
TS: బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Uttam kumar: మార్చి 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాబోతుందని కాంగ్రెస్ నీటీ పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ అవినీతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ రాకను తాము స్వాగతిస్తున్నామన్నారు. కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తామని, నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ సూచనలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గతంలో కుంగిపోయిన మెడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించినట్లు గుర్తు చేశారు. సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన డ్యామ్ సెఫిటీ అథారిటీ మెడిగడ్డలో ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయని, ఈ రెండు బ్యారేజ్ లలో కూడా నీటిని ఖాళీ చేయాలని సూచించిందన్నారు.

అత్యంత బాధ్యత రాహిత్యం..
ఈ మేరకు అథారిటీ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తుందన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యత రాహిత్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసిందని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి; Calcutta: మహిళలను ‘డార్లింగ్’ అంటే లైంగిక వేధింపే.. హైకోర్టు సంచలన తీర్పు!

అన్ని కోణాల్లో పరిశీలించి..
అలాగే మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసిందని చెప్పారు. దీంతో స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. బిఆర్ఎస్ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా మాట్లాడడం దురదృష్టకరమన్నారు.

బ్యారేజ్ గుండెకాయ లాంటిది..
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. 94 వేల కోట్ల వ్యయం చేసిన ఈ ప్రాజెక్టులో మెడిగడ్డ బ్యారేజ్ గుండెకాయ లాంటిది. బీఆర్ఎస్ నాయకుల మాటలకు విలువ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిన బీఆర్ఎస్ నాయకులు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం అత్యంత దురదృష్టకరం. బీఆర్ఎస్ నాయకులు బాద్యత రహితంగా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్ సెఫిటీ అథారిటీ, నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే పాటిస్తుందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు