Thatikonda Rajaiah: కడియం కులంపై విచారణ జరపాలి.. తాటికొండ రాజయ్య గరం TG: కడియం శ్రీహరి కులంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. త్వరలోనే కడియం కుటుంబం శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందని అన్నారు. బినామీ పేర్లతో కడియం భారీగా ఆస్తులను కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 30 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Thatikonda Rajaiah: మాజీ మంత్రి, ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్సీ తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి దళిత ద్రోహి అని ఫైర్ అయ్యారు. కడియం కులం పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే కడియం కుటుంబం శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందని అన్నారు. బినామీ పేర్లతో కడియం శ్రీహరి ఆస్తులను కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ALSO READ: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తనకు కాకుండా కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనే బాధతో తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలను కేసీఆర్ రాజయ్యకు అప్పగించారు. ఇటీవల కేసీఆర్ కూడా.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. మూడు నెలల్లో స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాక తప్పదని అన్నారు. రాజయ్య ఎమ్మెల్యే కావడం ఖాయమని పేర్కొన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ జీవితానికి సమాధి చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. #brs #kadiam-srihari #lok-sabha-election-s #thatikonda-rajaiah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి