KTR : ప్రజలు తిరగబడుతారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆరు నెలల్లో తెలంగాణ ప్రజలు తిరగబడుతారని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని ఎమ్మెల్సీ సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందని కేటీఆర్ అన్నారు.

New Update
KTR : ప్రజలు తిరగబడుతారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA KTR : బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎమ్మెల్సీలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) సమావేశమయ్యారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పై ప్రజలు తిరగబడతారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ(BJP) ఒకటే అని అన్నారు. మోడీ-అదానీ ఒక్కటే అని గతంలో రాహుల్‌ గాంధీ అన్నారని.. మొన్న రేవంత్‌రెడ్డి కూడా అదానీ, మోడీ ఒకటేనని విమర్శించారని పేర్కొన్నారు.

ఎన్నికల ముందు అదానీ దొంగ అని రేవంత్ ఆరోపించారని గుర్తు చేశారు. అదే రేవంత్‌రెడ్డి దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్‌ చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ అవకాశవాదం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానీతో కలిసి ఎందుకు పని చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఒత్తిడి కొనసాగిస్తాం..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తాం అని అన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తామని తెలిపారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని అన్నారు. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులు కూడా ఇప్పటికే ఆప్ట్ చేసుకున్న తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు!

గ్రామస్థాయి నుంచి..

బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి పోలీట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారని తెలిపారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని అన్నారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేయనున్నుట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

త్రిముఖ పోటీ...

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని... వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. త్వరలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని... అందులో శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని కేటీఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Elections: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

DO WATCH:

Advertisment
తాజా కథనాలు