/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T191553.432.jpg)
రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడిన విపక్ష నేత రాహుల్ గాంధీ.. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన న్యాయపత్రకు ( మేనిఫెస్టో) విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే.. ఫిరాయింపులను అరికడతామని చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు.
Also read: తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
రాహుల్ గాంధీకి తాము హామీ ఇచ్చిన పార్టీల ఫిరాయింపులను నిరోధిస్తామన్న మేనిఫెస్టో అంశంపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని స్వాగతించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీలో చేరిన అరడజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతేంటని ప్రశ్నించారు. వీటన్నింటిపై మౌనంగా ఉంటున్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన న్యాయపత్రను కేటీఆర్ కూడా పోస్టు చేశారు. అందులో తాము రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికైన ఎమ్మెల్యే లేదా ఎంపీ తన పార్టీ నుంచి వెళ్లిపోతే.. ఆటోమెటిగ్‌గా అతనిపై అనర్హత వేటు వేసేలా చేస్తామని చెప్పింది. దీనిపై నెటీజన్లు విభిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు.
Also read: మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
BRS MP Keshava Rao tendered resignation after joining the Congress party. Welcome his decision
What about the BRS MLA who defected and contested Loksabha on Congress ticket?
What about half a dozen other BRS MLAs who defected to congress?@RahulGandhi is this how you are… pic.twitter.com/6NEN71J5GA
— KTR (@KTRBRS) July 4, 2024