Telangana : బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి ఇంద్రకరణ్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆపార్టీ నుంచి వరుసగా నేతలు బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఇర్ఎస్ నుంచి జంప్ చేస్తున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం.

Telangana : బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి ఇంద్రకరణ్ రెడ్డి
New Update

BRS Leader Indrakaran Reddy :బిఆర్ఎస్ పార్టీ(BRS Party) కి మరో ఎదురు దెబ్బ తగలనుంది. వరుసగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నా వేళ మరో ముఖ్యనేత కూడా బీఆర్‌ఎస్‌ను వదిలివెళ్ళనున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌(Congress) లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా ఇంద్రకరణ్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు జరుపుతోందని సమాచారం. నిన్న ఇంద్రకరణ్ రెడ్డి పెద్దన్న చనిపోవడంతో పరామర్శించేందుకొచ్చారు సుదర్శన్‌రెడ్డి. ఆ సమయంలో కాంగ్రెస్ లో చేరికపై చర్చలు జరిపినట్టు సమాచారం. దీనికి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన అంగీకరించినట్టు సన్నిహితులు చెబుతున్నారు.కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తారని అంటున్నారు.ఇప్పటికే సన్నిహితులతో, ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక గురించి చర్చించారని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి..పార్టీ మార్పుపై ఇంద్రకరణ్ రెడ్డి త్వరలో కీలక ప్రకటన చేయనున్నారు.

 మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి హరిరావుపై 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది, 14వ లోక్‌సభ(Lok Sabha) లో అడుగుపెట్టారు ఇంద్రకరణ్ రెడ్డి. ఆ తర్వాత డీఆర్ఎస్‌లో చేరారు. 1980 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న ఇంద్రకరణ్ రెడ్డి.. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా కొనసాగారు.

1991 నుంచి 1996వరకు ఎంపీగాను, 1999 నుంచి 2004 వరకు 11వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా 2004 నుంచి 2008 వరకు ఉమ్మడి ఏపీ ఎమ్మెల్యేగా, 2008 నుంచి 2009 వరకు 14వ లోక్‌సభ సభ్యుడిగా, 2014 నుంచి 2018 వరకు తొలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా, 2018 నుంచి రెండోసారి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా మంత్రిగా చేశారు.

Also Read : Delhi: అలా చేస్తే భోజనం పెట్టొద్దు…మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపు

#ministers-indrakaran-reddy #congress #telangana #brs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి