లోకసభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ తరపున ఎన్నికల సంఘానికి దాసోజు శ్రవణ్, కర్నే ప్రభాకర్ లు ఫిర్యాదు చేశారు.
తుక్కు గూడ సభలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా బీఆర్ఎస్ పై ,కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ ,కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు.
ఇది కూడా చదవండి: క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..ఈ స్పెషల్ కోట్స్ మీకోసం.!