BRS Fire : ఆ సమయంలో రైతుబంధు విడుదల ఆపాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ.. భగ్గుమన్న బీఆర్ఎస్..!!

ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల విడుదల ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడాన్ని..బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ రైతులకు ద్రోహం చేసేలా కాంగ్రెస్ మరో కుట్రకు తెరలేపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అడ్డుకునే కుట్ర చేస్తుందంటూ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ రైతు విద్రోహ చర్యలపై అన్నదాతలు సైతం మండిపడుతున్నారని బీఆర్ఎస్ అంటోంది. రైతుబంధుపై కాంగ్రెస్ అక్కసును తీవ్రంగా ఖండించింది. రైతులంగా కేసీఆర్ వెంట ఉన్నారన్న కారణంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీకి కాంగ్రెస్ రాసిన లేఖపై మండిపడుతూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ప్రకటన విడుదల చేశారు.

Telangana: దేవరకొండలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అనుచరులు..
New Update

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులను రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కానీ, నవంబర్ 30న పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కానీ విడుదల చేసేలా జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈనేపథ్యంలో రైతుబంధు స్కీంను ఆపాలంటూ ఈసీకి ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్రావు ఠాక్రే లేఖ రాశారు. రైతుల ఖాతాలో నగదు జమను ఆపాలంటూ లేఖలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ రాసిన లేఖపై అధికార బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తెలంగాణ రైతులకు ద్రోహం చేసేలా కాంగ్రెస్ మరో కుట్రకు తెరలెప్పింది అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతు సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుతంత్రం పన్నుతుందంటూ మండిపడింది. కాంగ్రెస్ రైతు విద్రోహ చర్యలపై అన్నదాతలు సైతం విమర్శిస్తున్నారు. రైతులంతా కేసీఆర్ వెంట ఉన్నారన్న అక్కసుతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి:  మునుగోడు కాంగ్రెస్‎లో ముసలం..చలమల కృష్ణారెడ్డి అలక..!!

మాణిక్‌రావు ఠాక్రే రాసిన ఈ క్రూరమైన లేఖతో రేవంత్‌ కాంగ్రెస్ @INCTelangana కర్కశ పెట్టుబడిదారీ మనస్తత్వంతో రైతు, పేదల వ్యతిరేక వైఖరిని మరోసారి సిగ్గు లేకుండా బయటపెట్టిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయన ఏమన్నారంటే...

1. మాణిక్‌రావ్ జీ, ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ రైతులు వ్యవసాయాన్ని ఆపలేరు, రైతులను వేధించకూడదని మీరు అర్థం చేసుకోకపోవడం మీ మూర్ఖత్వానికి ప్రతీక.

2. మీ చిల్లర రాజకీయాల కోసం, యావత్తుమానవాళికి అన్నం పెడుతూ ఎన్నో త్యాగాలు చేసి నిస్వార్ధంగా కష్టపడే రైతన్న జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గం.

3. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కి విజ్ఞప్తి జాలి, దయ లేని మీ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాను. @INCIndiaLive @INCSandesh

4. మన రైతులు, బడుగు, బలహీన వర్గాల యొక్క సంక్షేమం, భవిష్యత్తు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కాకూడదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారిలా రైతులు, బడుగు బలహీన శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

5. మీ విభజన, వివక్ష రాజకీయాలను తిప్పికొట్టి, మా రైతులను రక్షించుకుంటాం.

6. కేసీఆర్ గారు గొప్ప సంకల్పంతో దూరదృష్టితో రూపొందించి, ప్రారంభించిన రైతు బంధు కార్యక్రమం రైతులకు అత్యంత అవసరం దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తున్నాయి.

7. మోసగాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసలు రంగును తెలంగాణ ప్రజలు గ్రహించాలి. రేవంత్ కాంగ్రెస్ రైతులను, పేదలను పట్టించుకోరు, కేవలం ఓట్ల కోసమే చూస్తున్నారు.

8.మనం జాగ్రత్త గా ఉందాం. వారికి తగిన గుణపాఠం చెబుదాం.

ఇది కూడా చదవండి:ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

కాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత నిధులు విడుదల చేయడం ద్వారా బీఆర్ఎష్ ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున రైతుబంధు నిధులను విడుదల చేసి ఓటర్లను ప్రభావితం చేశారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారా ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్ల భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైరామ్ రమేష్ బుధవారం ఢిల్లీలో ఈసీని కలిశారు. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

publive-image

publive-image

#brs #revanth-reddy #rythubandhu #congressparty #ece
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe