BRS Election Promises 2023: గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపు.. బీఆర్ఎస్ సంచలన హామీలివే?

సీఎం కేసీఆర్ గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపుపై సంచలన హామీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హామీలపై గులాబీ బాస్ కసరత్తు పూర్తయినట్లు సమాచారం.

BRS Election Promises 2023: గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపు.. బీఆర్ఎస్ సంచలన హామీలివే?
New Update

BRS Election Promises 2023: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నేటి నుంచి దూకుడును మరింతగా పెంచేందుకు సిద్ధమైంది. సంచలన హామీలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు, గ్యాస్ ధర తగ్గింపుపైనా బీఆర్ఎస్ హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆసరా పింఛన్లు ఎంత మేరకు పెంచాలి? గ్యాస్ ధరలను ఎంత మేర తగ్గించాలి? అన్న విషయంపై గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) కసరత్తు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి హరీష్ రావు (Minister Harish Rao)  ఇప్పటికే హింట్ ఇచ్చారు. త్వరలో సీఎం కేసీఆర్ ప్రజలకు భారీ శుభవార్త చెప్పబోతున్నారని ఆయన ఇటీవల పలు సభల్లో ప్రకటించారు. గ్యాస్ ధరను రూ.700లకు తగ్గించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాతనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: CM KCR Wife Shobha: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి..!!

అయితే.. ముందే ఈ పథకాలను ప్రకటిస్తారా? లేదా మేనిఫెస్టోలనే ఈ అంశాలను చేర్చుతారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలోనే ఓటర్లను అత్యంత ఆకర్షించే అవకాశం ఉన్న ఈ పథకాలను వెంటనే ప్రకటిస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 15న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి: CM KCR: ఇక రంగంలోకి కేసీఆర్.. సెంటిమెంట్ గా అక్కడ తొలి మీటింగ్!

ఆ సమావేశంలోనే సీఎం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (BRS Manifesto) విడుదల చేయనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తొలి ఎన్నికల సభ నిర్వహించనున్నారు సీఎం. అనంతరం 16, 17, 18 తేదీల్లో వివిధ జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. నవంబర్‌ 9న రెండుచోట్ల కేసీఆర్ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

#brs-election-promises-2023 #brs-election-manifesto #brs #cm-kcr #telangana-elections-2023 #harish-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి