BRS: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. ‘కాంగ్రెస్‌ 420 హామీలు’ పేరుతో బీఆర్ఎస్ సంచలన బుక్లెట్

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ ‘కాంగ్రెస్‌ 420 హామీలు’ పేరుతో బుక్లెట్ విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకే హామీలు ఇచ్చారని పేర్కొంది. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలేది లేదని తెలిపింది.

BRS: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. ‘కాంగ్రెస్‌ 420 హామీలు’ పేరుతో బీఆర్ఎస్ సంచలన బుక్లెట్
New Update

'Congress 420 Promises' Booklet by BRS: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై (Congress Party) బీఆర్ఎస్ పార్టీ (BRS) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. తాజాగా కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన 'కాంగ్రెస్ 420' హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది.

ALSO READ: AP Politics: షర్మిలతో పాటు జగన్ ఇంటికి వెళ్తున్నా.. కాంగ్రెస్ లో కూడా చేరుతున్నా: ఎమ్మెల్యే ఆర్కే 

కేవలం ఎన్నికల్లో (TS Elections) గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాటి అమలుపైన ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్లెట్ ని తయారు చేసింది. వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాత్రం కేవలం ఆరు హామీల (Congress 6 Guarantees) మాట జపిస్తుందని, ఆరు హామీలు కాదు ఇచ్చింది 420 హామీలు అంటూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో పాటు వివిధ డిక్లరేషన్ల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒకచోట చేర్చి ఈ బుక్లెట్ ని ప్రచురించింది

కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఇచ్చిందో లేదా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు నిర్ణయించి ముందే డిసైడ్ అయిందో తెలవదు కానీ మోసానికి మారుపేరుగా నిలిచే 420 నంబర్ తీరుగా ఈ హామీలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కార్యక్రమాలు ప్రారంభించాలని... కేవలం సాగదీసే ప్రక్రియలకు పాల్పడకుండా ... రానున్న లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లు మాటకు కట్టుబడి ఉండి హామీలను నెరవేర్చాలని పార్టీ పేర్కొంది. కేవలం 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తామని పార్టీ తెలిపింది.

ALSO READ: రేపు కేసీఆర్ ను కలవనున్న జగన్.. కారణమిదే?

#telangana-elections #brs-party #congress-6-guarantees #congress-420-promises
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe