KCR: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం.. డేట్స్ ఫిక్స్

ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు.

KCR: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం.. డేట్స్ ఫిక్స్
New Update

KCR to Takes oath as MLA: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా (Gajwel MLA) ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో తుంటి ఎముకకు గాయం అయింది. ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆయన తుంటి ఎముకకు వైద్యులు సర్జరీ చేయగా.. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేదు. తాజాగా ఆయన ఆరోగ్యం కోలుకోవడంతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఎంపీలతో కేసీఆర్ భేటీ..

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం (BRS Party Meeting) ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహాలపై కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Also Read: త్వరలో తెలంగాణలో కులగణన!

బలమైన వాదనలు వినిపించాలి…

ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు.

త్వరలో నేను వస్తున్న..

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుంటున్న కేసీఆర్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో, ప్రజాక్షేత్రంలో దూరంగా ఉన్నారు. త్వరలో ప్రజా క్షేత్రంలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఎవరు అధైర్య పడొద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో (Telangana Parliament Elections) బీఆర్ఎస్ దే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

#kcr #mla-kcr #brs-party #gajwel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe