KCR : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేసీఆర్ వీడియో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సర్జరీ తరువాత నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ కోలుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపడుతారని ఇటీవల కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. By V.J Reddy 17 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Chief KCR : బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి చెందిన తరువాత మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రగతి భవన్(Pragathi Bhavan) ప్రస్తుత ప్రజా భవన్ ను ఖాళీ చేసి.. ఎర్రవల్లి(Erravalli) లోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్.. డిసెంబర్ 8న తుంటి ఎముక గాయంతో హైదరాబాద్(Hyderabad) లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. సర్జరి అనంతరం డిశ్చార్జ్ అయిన కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో మూడు నుంచి నాలుగు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. తాజాగా కేసీఆర్ నడిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేసీఆర్ మీరు తొందరగా కోరుకువాలి అంటూ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ALSO READ: Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన రాజకీయాల్లో కేసీఆర్ మాస్ రీ ఎంట్రీ.. కోలుకుంటున్న కేసీఆర్ త్వరలో గజ్వేల్(Gajwel) లో పర్యటిస్తారని బీఆర్ఎస్(BRS) పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కనుబాటలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు(Harish Rao) లు ప్రతిపక్ష హోదాలో అటు ఇటీవల జరిగిన అసెంబ్లీ లోనూ అలాగే బయట కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు వస్తుడడంతో భారీగా సన్నాహాలు చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే రోజు నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 20 తరువాత కేసీఆర్ మొదటి సరిగా గజ్వేల్ లో పర్యటించనున్నట్లు సమాచారం. వరంగల్ లో బహిరంగ సభ.. పార్టీ కార్యకలాపాలను ఇకపై తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడే జరపనున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడ ర్ తో వరుస భేటీలు జరిపేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22న పార్టీ లోక్ సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా, ఆ తర్వాత అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలోనూ ఇదే తరహా మీటింగ్ లు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో లోక్ సభ ఎన్నికల షెడ్యూలు వెలువడేలోపు బీఆర్ఎస్ సత్తాను చాటేలా అక్కడ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ALSO READ: FLASH: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్! #erravalli #brs-chief-cm-kcr #harish-rao #telangana-assembly-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి