BRS Chief KCR: కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు వెళ్ళనున్నారు. అక్కడ నుంచి సిరిసిల్ల కూడా వెళ్ళి రైతులను కలవనున్నారు. ఎండిన పంటలను పరిశీలించనున్నారు. ఉదయం 8.30 గంటలకు బయలుదేరి..11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం ఎమ్మెల్యే గంగుల్ కమాలకర్ ఇంట్లో భోజనం చేయనున్నారు కేసీఆర్. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను విననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మిడ్‌మానేరు ప్రాజెక్టును సందర్శించి..నాయంత్రం 4 గంలకు సిరిసిల్ల చేరుకోనున్నారు.
సిరిసిల్లో కీలక ప్రకటన..
సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. అక్కడే ఆయన ఒక కీలక ప్రకటన చేయనున్నారని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఇది ఏం అంశానికి చెందిన ప్రకటన అయి ఉంటుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది. రైతుల అంశంపైనే కేసీఆర్ ప్రకటన ఉండబోతోందా?ఇంకా వేరే అంశం ఏదైనా ఉందా? అనే సందుహాలు వెలువడుతున్నాయి. ఈ ప్రకటన కోసం బీఆర్ఎస్నేతలు, కేసీఆర్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. మీడియా సమావేశం తర్వాత నాయంత్రం 5గంటలకు కేసీఆర్ బయలుదేరి రాత్రి 7గంటలకు ఎర్రవెల్లిలో ఆయన ఫాంహౌస్‌కు చేరుకోనున్నారు.
Also Read:Santhi Swaroop: మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత