Tellam Venkat Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్!

రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలా? బీఆర్ఎస్‌లోనే ఉండాలా? అని తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Tellam Venkat Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్!

BRS MLA Tellam Venkat Rao: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రేపటి సీఎం రేవంత్‌ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన వెంకట్రావ్‌ ను దూరంగా పెట్టారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. ఇటీవల సీఎం రేవంత్‌ను కలిశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌. ఈ క్రమంలో తెల్లం కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇదిలా ఉంటే వెంకట్రావ్‌ను తీవ్రంగా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వర్గం వ్యతిరేకిస్తోంది. మరోవైపు.. తెల్లంకు పార్టీ సమావేశాలకు ఆహ్వానం అందిస్తోంది బీఆర్‌ఎస్‌. ప్రస్తుతం అగమ్యగోచరంగా తెల్లం వెంకట్రావ్‌ రాజకీయ భవిష్యత్తు.. ఎటువైపు వెళ్లాలనే అయోమయంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్.. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు

వలసల వలయంలో బీఆర్ఎస్

తెలంగాణ(Telangana) లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) లోకి వలసలు ఆగడం లేదు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఈ జాబితాలో బీఆర్ఎస్ నుంచి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkat Rao) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసం లో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం మరోసారి జోరందుకుంది.

అది తూచ్.. అభివృద్ధి గురించే..

ఇదిలా ఉండగా.. భద్రాచలం(Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. నియోజక అభివృద్ధి విషయాలు మాట్లాడేందుకు ఆయన సీఎం రేవంత్ ను కలిశారని.. రాజకీయాలు మాట్లాడేందుకు కలవలేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది బీఆర్ఎస్. మరోవైపు సీఎం రేవంత్ తో భేటీ తెల్లం వెంకట్రావు స్పందించకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

Advertisment
తాజా కథనాలు