CM Revanth: రుణమాఫీపై మాటతప్పిన సీఎం రాజీనామా చేయాలంటూ రాష్ట్రంలో పోస్టర్లు వెలవడం హాట్ టాపిక్ గా మారింది. 'రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం' అంటూ వెలసిన హోర్డింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. రుణమాఫీ మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యాలని హైదరాబాద్ లో అర్ధరాత్రి పోస్టర్లు ఏర్పాటు చేశారు. రూ.31 వేల కోట్లు చెప్పి రూ.17 వేల కోట్ల మాఫితో సరిపెట్టారని సీఎంపై పోస్టర్ల రూపంలో విమర్శలు గుప్పించారు. అయితే అకస్మాత్తుగా వెలిసిన పోస్టర్లు, హార్డింగ్స్ ను నగర వాసులు ఆసక్తిగా తిలకిస్తుండగా.. కొందరు వీటిని వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు.
అలాగే సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం దారుణం. తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం ఘోరం. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నాను.
Also Read : జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్