James Cleverly : భార్య, భర్త ల రిలేషన్(Wife and Husband Relationship) పై బ్రిటన్ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని నివాసంలో జరిగిన పార్టీలోనే, మహిళా అతిథుల ముందు భార్యలను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కట్టుకున్న పెళ్లానెప్పుడూ మత్తులోనే ఉంచాలని, ఇది చట్ట విరుద్దమేమీ కాదంటూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యగ్యంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఈ మేరకు బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ(James Cleverly) ఈ నెల 18న బ్రిటన్(Britain) ప్రధాని రిషి సునాక్ నివాసంలో జరిగిన విందులో మహిళా అతిథులతో మంత్రి మాట్లాడినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘వివాహ బంధం దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యను(Wife) ఎప్పుడూ కొంత మత్తులో ఉంచాలి. తన భర్తకంటే మెరుగైనవారు ఎంతోమంది ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించకుండా భార్యకు నిరంతరం కొద్దిమోతాదులో మత్తు ఇచ్చి జోకొట్టాలి. అయితే కొద్దిగా మత్తెక్కించడమనేది చట్టవిరుద్ధమేమీ కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి
దీంతో జేమ్స్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో తాను సరదాగా అలా అన్నానని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశారు జేమ్స్. ప్రైవేటు సంభాషణలో చేసిన వ్యాఖ్యలు కేవలం జోక్ అని, దానికి ఆయన క్షమాపణలు చెబుతున్నారని క్లెవర్లీ ప్రతినిధి తెలిపారు. అయినా శాంతించని మహిళల సంఘాలు హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.