Bihar : కుప్పకూలిన మరో వంతెన!

బీహార్ లో గత కొంతకాలంగా ఏదోక చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి.తాజాగా మూడోసారి ఖగారియాలోని అగువానీ- సుల్తంగంజ్‌ మధ్య గంగా నది పై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్‌ స్లాబ్‌ నిర్మాణం గంగా నదిలో పడి పోయింది.

Bihar : కుప్పకూలిన మరో వంతెన!
New Update

Bihar : బీహార్ లో గత కొంతకాలంగా వంతెనలు కూలడం ఇటీవల పరిపాటిగా మారింది. నిత్యం ఏదోక చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పాత వంతెనలు కూలుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా మూడోసారి ఖగారియాలోని అగువానీ - సుల్తంగంజ్‌ మధ్య గంగా నది పై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్‌ స్లాబ్‌ నిర్మాణం గంగా నదిలో పడి కూలిపోయింది.

సుల్తాన్‌ గంజ్‌ నుంచి అగువానీ ఘాట్‌ వైపు 9,10 నంబర్ల మధ్య భాగం గంగా నదిలో మునిగిపోయింది. ఈ వంతెనను ఎస్పీ సింగ్లా కంపెనీ నిర్మిస్తోంది. ఈ వంతెన ఖగారియా, భాగల్‌పూర్‌ జిల్లాలను కలుపుతూ నిర్మించారు.

Also Read: నన్ను దయచేసి క్షమించండి.. ప్రజాదర్బార్ ఫిర్యాదుదారుడికి లోకేష్ ఊహించని రిప్లై!

#collapsed #bridge #bihar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe