AP Politics: సీఎం జగన్ (CM Jagan) కు షాక్ ఇచ్చారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnam Raju). అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై సీఎం జగన్ బయట ఉన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు రఘురామ కృష్ణరాజు. ఈ నెల 24న ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నారు.
ALSO READ: తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
సీఎం జగనే టార్గెట్ గా గతంలో కూడా ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేసి, అక్రమాస్తుల కేసులపై విచారణ వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) కౌంటర్ దాఖలు చేసింది సిబీఐ దర్యాప్తు సంస్థ. దీనిపై విచారణ సీబీఐ (CBI) కౌంటర్ అనంతరం రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ... తెలంగాణ హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఎంపీ రఘురామ.
ALSO READ: ఆ సీనియర్ హీరో నన్ను ఒక రాత్రికి రమ్మన్నాడు.. తమిళ నటి