Chandra Babu Case: మద్యం కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. cచంద్రబాబు బెయిల్ తో పాటు టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిటిషన్ పై కూడా విచారణ జరిపింది. ఇద్దరి పిటిషన్ల విచారణ అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనీ సీఐడీకి తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు అని ఉత్తర్వులు జారీ చేసింది.
ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!
గతంలో స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మద్యం కేసులో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును ఆగస్టు 9న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. దాదాపు 52రోజులపాటు రాజమండ్రి జైలులో ఉన్నారు చంద్రబాబు. అక్టోబర్ 31న అనారోగ్య సమస్యల కారణంగా నాలుగు వరాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు.
ALSO READ: రైతుబంధుకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈసీకి బీఆర్ఎస్ రిక్వెస్ట్!