Break To Free Current : గృహజ్యోతి పథకానికి బ్రేక్ పడనుంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావుడి నడుస్తోంది. నోటిఫికేషన్లు వచ్చేశాయి. దాంతో పాటూ ఎన్నికల కోడ్(Election Code) కూడా అమల్లోకి వచ్చేసింది. కాబట్టి ప్రస్తుతం దేశంలో చాలావాటికి రిస్ట్రిక్షన్ వచ్చేశాయి. ఏ ప్రభుత్వమూ కొత్త పథకాలను మొదలుపెట్టడానికి వీలు లేదు. ఇప్పటికే అమలులో ఉన్నవాటిని మాత్రం కొనసాగించవచ్చును. దీంతో తెలంగాణ(Telangana) లో అమలు అవుతున్న గృహజ్యోతి పథకానికి(Gruha Jyothi Scheme) కూడా అడ్డు వచ్చింది. ఇప్పటికే చాలా మంది ఈ పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. వారికి యథావిథిగానే గృహజ్యోతి పథకం ప్రకారం ఉచిత కరెంట్ ఇస్తారు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రం ఇప్పుడు పథకాన్ని అమలు చేయలేరు.
ఎన్నికలు అయ్యాక కోడ్ ముగిసిన వెంటనే కొత్త దరఖాస్తులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని చెబుతోంది కాంగ్రెస్(Congress) ప్రభుత్వం. గృహజ్యోతి కింద గత నెలలో 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు అమలు చేస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉండగా..
తమకు ఉచిత విద్యుత్ కావాలంటూ వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేస్తున్నామని తెలిపారు.మళ్లీ జూన్ నుంచి కొత్త దరఖాస్తులకు ఆమోదం ఉంటుందని చెప్పారు. గృహజ్యోతి పథకం వలన జీరో బిల్లుల రాయితీ సొమ్ము రూ.300 కోట్లకు చేరే ఛాన్స్ ఉందని... ఆ మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు.
Also Read:కాసేపట్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత