Bank : పెన్షన్‌ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చి అడ్డంగా బుక్కైంది!

పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి!

New Update
Bank : పెన్షన్‌ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చి అడ్డంగా బుక్కైంది!

Dead Man : పెన్షన్(Pension) కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు(Bank Officers) అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియా(Social Media) లో పెట్టడంతో ఈ విషయం కాస్త వైరల్‌ గా మారింది. అసలేం జరిగిందంటే.. బ్రెజిల్‌(Brazil) కు చెందిన ఎరికా డి సౌజా వియెరా నూన్స్ అనే మహిళ తన మేనమామ పాలో రాబర్టో ను వీల్‌చైర్‌ లో బ్యాంకు కు తీసుకుని వచ్చింది.

అయితే అప్పటికే పాలో రాబర్టో బ్రాగా (68) చనిపోయాడు. ఆయన పేరు మీద ఉన్న పెన్షన్‌ ని క్లైమ్ చేసుకోవడానికి ఆయన ఇంకా బతికే ఉన్నట్లు వీల్ చైర్ పై బ్యాంకు కు తీసుకొచ్చి పెన్షన్ డ్రా చేయడానికి ప్రయత్నించింది. బ్యాంక్‌ పేపర్స్‌ పై సంతకం పెట్టించడానికి ట్రై చేసింది. అనారోగ్యంతో ఉన్న పాలో రాబర్టోను ఆయన మేనకోడలు ఎరికా డి సౌజా వియోరా నే చూసుకుంటుంది.

పాలో రాబర్టో పేరు మీద లోన్‌ అప్లై చేసింది. అయితే రాబర్టో బ్రాగా చనిపోయాడు. దీంతో ఈ విషయాన్ని దాచి పెట్టి ఆమె తన మేనమామను వీల్‌ చైర్ లో బ్యాంకు కు తీసుకుని వచ్చి సంతకం పెట్టించడానికి ప్రయత్నించింది. కానీ అతను ఏమాత్రం కదలకపోవడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

Also read: ‘సీమ్యాట్‌’ దరఖాస్తుల గడువు పొడిగింపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు