Brahmamudi: మీడియాకు అడ్డంగా దొరికిపోయిన కళ్యాణ్, అప్పు.. అనామికకు ఊహించని ట్విస్ట్..! షాక్ లో కావ్య..!

మాయ కోమాలో నుంచి బయటకు వచ్చిందని తెలుసుకున్న రుద్రాణి, కావ్య కంటే ముందే హాస్పిటల్ కు రౌడీలను పంపి మాయను కిడ్నాప్ చేయిస్తుంది. ఇక హాస్పిటల్ లో మాయ కనిపించకపోవడంతో షాకవుతుంది కావ్య. మరో వైపు మాయ కోసం వెళ్లిన కళ్యాణ్, అప్పుకు ఊహించని సంఘటన ఎదురవుతుంది.

New Update
Brahmamudi: మీడియాకు అడ్డంగా దొరికిపోయిన కళ్యాణ్, అప్పు.. అనామికకు ఊహించని ట్విస్ట్..! షాక్ లో కావ్య..!

Brahmamudi Serial Today: సుభాష్ తాను చేసిన తప్పుకు పశ్చాతాపడుతుంటాడు. తాను చేసిన తప్పుకు ఎంతలా బాధపడుతున్నాడు భార్య అపర్ణకు వివరించే ప్రయత్నం చేశాడు. నీకు అన్యాయం చేశాననే బాధతో చనిపోవాలనుకున్నాను. నీకు కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు అపర్ణతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ అపర్ణ మాత్రం భర్త చేసిన తప్పును క్షమించలేకపోతుంది.

Brahmamudi Serial Today

ఇక కావ్య (Kavya) అత్త అపర్ణ, మామయ్య సుభాష్ మధ్య దూరాన్ని ఎలా తొలగించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడి వచ్చిన అప్పు కావ్యకు షాకింగ్ న్యూస్ చెప్తుంది. మాయ కోమాలో నుంచి బయటకు వచ్చినట్లు చెప్తుంది.

Brahmamudi Serial Today

Brahmamudi: మాయ కోమాలో నుంచి బయటకు వచ్చినదని తెలియడంతో సంతోషపడుతుంది కావ్య. మాయ ద్వారా అసలు నిజాలేంటో తెలుసుకొని అత్తయ్య, మావయ్యను కలపాలని అనుకుంటుంది. ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కి బయలుదేరాలని అప్పుతో చెప్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్ (Kalyan) తాను కూడా వస్తానని చెప్తాడు.

publive-image
ఇక కావ్య, కళ్యాణ్, అప్పు హాస్పిటల్ కి బయలుదేరుతారు. మరో వైపు మాయ కోమాలో నుంచి బయటకు వచ్చిందని తెలుసుకున్న రుద్రాణి కావ్య కంటే ముందే హాస్పిటల్ కు రౌడీలను పంపి మాయను కిడ్నాప్ చేయిస్తుంది.

publive-image

ఆ తర్వాత హాస్పిటల్ కి వచ్చిన కళ్యాణ్, కావ్య, అప్పు అక్కడ మాయ లేకపోవడంతో షాకవుతారు. వెంటనే మాయ ఎక్కడని డాక్టర్ ను వెళ్లి అడుగుతుంది కావ్య . దీంతో డాక్టర్ మీరు చెప్పారనే కదా డిశ్చార్జ్ చేశామని కావ్యకు షాకిస్తుంది. ఇక అసలు విషయం అర్థం చేసుకున్న కావ్య మాయను వెతకడం మొదలుపెడుతుంది.

publive-image

ఇంట్లో రాజ్ (Raj) తల్లి అపర్ణకు టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తండ్రి సుభాష్ ఒకసారి క్షమించమని తల్లి అపర్ణకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు రాజ్

Brahmamudi Serial Today

మరో వైపు కళ్యాణ్, అప్పు కూడా మాయను వెతుకుంటూ వెళ్తారు. ఈ క్రమంలో ఒక గదిలో చిక్కుకుపోయిన కళ్యాణ్, అప్పు అనుకోని పరిస్థితిలో మీడియాకు దొరికిపోతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Mr Bachchan: మిస్టర్ బచ్చన్ 'షో రీల్'.. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ - Rtvlive.com 

Advertisment
తాజా కథనాలు