Also Read : Venkatesh Daughter : వెంకటేశ్ చిన్న కూతురు, అల్లుడి సింప్లిసిటీ.. తిరుపతిలో సామాన్యుల లాగా..
'శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన' పుస్తకావిష్కరణలో బ్రహ్మానందం
బ్రహ్మానందం(Brahmanandam) మాట్లాడుతూ.. స్వామివారి చిత్రాలతో రూపొందిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అదృష్టం ఆ శ్రీనివాసుని దయవల్లే కలిగింది. నా మిత్రుడి సలహాతో నేను చిత్రీకరించిన చిత్రాన్ని పుస్తకం పై ముద్రించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. అలాగే "లలిత కళల్లో నైపుణ్యం సాధించడం అందరికి సాధ్యపడదు .. అమ్మవారి ఆశీస్సులు ఉన్నవారే రాణించగలరు. కళాకారులు తమ బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గడ్డి పువ్వులో అందాన్ని చూడగలిగితేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్థమవుతుంది అంటూ కళల నైపుణ్యం గురించి గొప్పగా మాట్లాడారు."
కళాకారుడి కుటుంబానికి బ్రహ్మానందం 2 లక్షల సహాయం
అంతే కాదు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మానందం.. అక్కడ మరణించిన ఓ కళాకారుడి కుటుంబానికి 2 లక్షల 17 వేల ఆర్ధిక సాయాన్ని అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన బ్రహ్మానందం అభిమానులు అతని మంచి మనసును ప్రశంసిస్తు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : Actress Anjali : విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి?