Brahmanandam : హస్యబ్రహ్మా వరం.. రూ.2లక్షల సాయం.. నువ్వు నిజంగా దేవుడివి బాసు!

హాస్య నటుడు బ్రహ్మానందం నేడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో నిర్వహించిన 'శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన' పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గీసిన చిత్రాన్ని పుస్తకం పై ముద్రించడం గర్వకారణంగా ఉందని తెలిపారు.

New Update
Brahmanandam : హస్యబ్రహ్మా వరం.. రూ.2లక్షల సాయం.. నువ్వు నిజంగా దేవుడివి బాసు!
Book Launch : ప్రముఖ హాస్య నటుడు(Comedy Actor) బ్రహ్మానందం తాజాగా తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అయితే తిరుమలలో 'శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మానందం .. ముందుగా శ్రీవారిని దర్శించుకొని అనంతరం పుస్తకావిష్కరణ సభ(Book Launch Sabha) లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 202 మంది నైపుణ్య కళాకారులు గీసిన శ్రీవేంకటేశ్వరుని చిత్రాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మానందం లలిత కళల గొప్పతనం గురించి మాట్లాడారు.

Also Read : Venkatesh Daughter : వెంకటేశ్ చిన్న కూతురు, అల్లుడి సింప్లిసిటీ.. తిరుపతిలో సామాన్యుల లాగా..

'శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన' పుస్తకావిష్కరణలో బ్రహ్మానందం

బ్రహ్మానందం(Brahmanandam) మాట్లాడుతూ.. స్వామివారి చిత్రాలతో రూపొందిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అదృష్టం ఆ శ్రీనివాసుని దయవల్లే కలిగింది. నా మిత్రుడి సలహాతో నేను చిత్రీకరించిన చిత్రాన్ని పుస్తకం పై ముద్రించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. అలాగే "లలిత కళల్లో నైపుణ్యం సాధించడం అందరికి సాధ్యపడదు .. అమ్మవారి ఆశీస్సులు ఉన్నవారే రాణించగలరు. కళాకారులు తమ బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గడ్డి పువ్వులో అందాన్ని చూడగలిగితేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్థమవుతుంది అంటూ కళల నైపుణ్యం గురించి గొప్పగా మాట్లాడారు."

Book Launch

కళాకారుడి కుటుంబానికి బ్రహ్మానందం 2 లక్షల సహాయం 

అంతే కాదు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మానందం.. అక్కడ మరణించిన ఓ కళాకారుడి కుటుంబానికి 2 లక్షల 17 వేల ఆర్ధిక సాయాన్ని అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన బ్రహ్మానందం అభిమానులు అతని మంచి మనసును ప్రశంసిస్తు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read : Actress Anjali : విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి? 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Deepika Padukone: ప్రభాస్ ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్.. షాకింగ్ పోస్ట్!

దీపికా పదుకొనేకు బిగ్‌షాక్ తగిలింది. ‘కల్కి 2’ సినిమా నుంచి ఆమెను తొలగించినట్లు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డ కోసం వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్ చేయాలని దీపిక రిక్వెస్ట్ చేసిందని, సెట్ కాకపోవడంతో రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు టాక్.

New Update
deepika padukone exit from prabhas and nag ashwin kalki 2 movie

deepika padukone exit from prabhas and nag ashwin kalki 2 movie

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింతో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా కూడా మరో పార్ట్ రాబోతుంది. 

ఈ సారి ‘కల్కి 2’లో అందరి పాత్రలు మరింత పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీక్వెల్ మూవీ నుంచి దీపికా పదుకొనేను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమైంది? అంటూ నెట్టింట ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు

‘కల్కి2’ నుంచి దీపికా అవుట్

ఇదిలా ఉంటే వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్‌మెంట్, హై రెమ్యూనరేషన్ కారణంగా దీపికా పదుకొనేను ఇటీవల సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి తొలగించారు. ఈ విషయంలో ఆ మధ్య సందీప్ - దీపిక మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అది మరువక ముందే ఇప్పుడు దీపికను ‘కల్కి 2’ నుంచి తొలగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ పోస్టు వైరల్‌గా మారింది. 

బాలీవుడ్ మీడియా ప్రకారం.. ‘‘కల్కి 2’లో దీపిక పదుకొనే ఉండదని సమాచారం. తన బిడ్డ కోసం వర్కింగ్ హవర్స్ అడ్జస్ట్ చేయాలని మేకర్స్‌ని దీపిక చాలా రిక్వెస్ట్ చేసిందని.. కానీ అది సెట్ కాకపోవడంతో రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు ఆ పోస్టులో రాసి ఉంది. దీంతో దీపికా పదుకొనే ప్లేస్‌లో మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌ కోసం మేకర్స్ వెతుకుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అటు మేకర్స్, కానీ దీపిక పదుకొనే కానీ ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్‌ సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment