Brahmamudi : నిజస్వరూపం బయటపెట్టిన కళ్యాణ్.. 5 లక్షల కోసం కావ్య కిడ్నాప్..! బిడ్డ తల్లి మాయను వెతకడానికి వెళ్లిన కావ్య అనుకోని పరిస్థితిలో కిడ్నాప్ అవుతుంది. మరో వైపు మాయకు డబ్బులిచ్చి నిజం బయటకు రాకుండా చేయాలనీ ప్లాన్ చేస్తాడు రాజ్. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 15 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Daily Serial : కళ్యాణ్(Kalyan) ఆఫీస్ కు వెళ్లనని చెప్పడంతో అపర్ణ(Aparna) సీరియస్ గా అతని పై అరుస్తుంది. ఇంతలో అపర్ణ భర్త సుభాష్(Subash) మాట్లాడుతూ.. ఎందుకు కోపం తెచ్చుకుంటావు. చిన్నవాడైనా కళ్యాణ్ నిజం చెప్పాడు. ఒకప్పుడు రాజ్(Raj) ను మించిన సమర్ధుడు లేడని పట్టాభిషేకం చేశాం. ఇప్పుడెమో రాజ్ ను బాధ్యతల నుంచి తప్పించావు. ఇక ఇప్పుడు కళ్యాణ్ కూడా ఆఫీస్ కు వెళ్లానని చెప్పేశాడు. మరి కంపెనీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు అని అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్.. సారీ పెద్దమ్మ కంపెనీ నిలవాలంటే అన్నయ్య వల్లే అవుతుంది. నేను ఇక నుంచి కంపెనీ బాధ్యతలు చూసుకోవాలి అనుకోవడం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. భర్త కళ్యాణ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అనామిక కోపంతో రగిలిపోతుంది. కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంది. దీంతో కళ్యాణ్ నువ్ ఎంత ఓండ్రు పెట్టినా నేను కవిత్వం రాయడం ఆపను. కంపెనీకి వెళ్ళను. ఇష్టం ఉంటే ఉండు.. లేదంటే వెళ్ళిపో అని అనామికను వార్నింగ్ ఇస్తాడు. మరో వైపు సుభాష్ తాను చేసిన తప్పు కారణంగా రాజ్ అవమానాలు ఎదుర్కుంటున్నాడు అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది. మావయ్య సుభాష్ బాబు తల్లి గురించి మాట్లాడుతుంది. ఆమె అడ్రెస్స్ కనుక్కోవడానికి సుభాష్ ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకుంటుంది. కావ్య అత్త అపర్ణకు ఇచ్చిన మాట ప్రకారం బాబు తల్లిని తీసుకొస్తే అసలు నిజం బయటపడుతుంది అని రాజ్ టెన్షన్ పడతాడు. కళావతి మాయను కనిపెట్టే ముందు ఆమెకు డబ్బులిచ్చి దూరంగా వెళ్లిపొమ్మని చెప్పాలని ప్లాన్ చేస్తాడు రాజ్. బిడ్డ తల్లిని వెతుకుంటూ కావ్య వెళ్తుంది. కావ్య వెళ్లే దారిలో కొంతమంది ఆమెను చూసిన కొంతమంది రౌడీలు కావ్య ఫోటో తీసి అమ్మాయిలను అమ్మేసి ఓ వ్యక్తికి పంపిస్తారు. కావ్య ఫోటో చూసిన ఆ వ్యక్తి ఆమెను తీసుకొస్తే 5 లక్షలు ఇస్తానని రౌడీలకు చెప్తాడు. దీంతో వాళ్ళు కావ్యను కిడ్నాప్ చేస్తారు. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read: Brahmamudi: దుగ్గిరాల ఇంట్లో మళ్ళీ చిచ్చు పెట్టిన రుద్రాణి.. అపర్ణకు షాకిచ్చిన కళ్యాణ్..! #brahmamudi-today-episode #tv-serial #daily-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి