Brahmamudi: దుగ్గిరాల ఇంట్లో మళ్ళీ చిచ్చు పెట్టిన రుద్రాణి.. అపర్ణకు షాకిచ్చిన కళ్యాణ్..!

కళ్యాణ్ ఆఫీస్ కు వెళ్లకపోవడంతో మళ్ళీ ఇంట్లో రచ్చ మొదలుపెడుతుంది అనామిక. దీంతో ఇక నుంచి ఆఫీస్ కు వెళ్ళనని తెగేసి చెప్తాడు కళ్యాణ్. మరో వైపు కావ్య ఎలాగైనా బిడ్డ తల్లిని కనిపెట్టాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi: దుగ్గిరాల ఇంట్లో మళ్ళీ చిచ్చు పెట్టిన రుద్రాణి.. అపర్ణకు షాకిచ్చిన కళ్యాణ్..!

Brahmamudi: భర్త ద్వారా తండ్రికి డబ్బు సహాయం చేయాలని నిర్ణయించుకున్న అనామిక.. కళ్యాణ్ తో ప్రేమగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఆమె పై కోపంగా ఉన్న భర్త కళ్యాణ్ ను ప్రేమతో తన వైపు తిప్పుకోవాలని అనుకుంటుంది.

publive-image

కానీ అనామిక చేసిన పనులకు విసిగిపోయిన కళ్యాణ్ ఆమెను దూరంగా ఉంచుతాడు. ముక్కలైన మనసు మళ్ళీ అతకదు. నేను కూడా ఒకప్పుడు నీ దగ్గరికి ఇలా ప్రేమగా వస్తే ఛీ కొట్టావ్. ఎప్పుడూ నీకు నచ్చినట్లు మాత్రమే నేను ఉండాలని అనుకున్నావు అని భార్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దీంతో అనామిక దిమ్మతిరుగుతుంది.

publive-image

మరో గదిలో భర్త రాజ్ ను చూసి మురిసిపోతూ ఉంటుంది కావ్య. భర్త మనసులో తన పై ప్రేమ ఉందని సంతోషిస్తుంది. ఇంతలో కావ్య ఆత్మ బయటకు వస్తుంది. నీపై ప్రేమ ఉందని తెలిసింది కదా, తను ఎలాగూ బయటపడడు.. నువ్వే ముందుకు వెళ్లాలి. వెళ్లి నీ భర్తకు ముద్దు పెట్టు అని కావ్యను చెబుతుంది. కానీ కావ్య మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది.

publive-image

ఆ తర్వాత కళ్యాణ్ ఆఫీస్ కు వెళ్లకుండా హలో కూర్చొని కవితలు రాసుకుంటూ ఉంటాడు. ఇది చూసిన రుద్రాణి కళ్యాణ్, అనామికల మధ్య చిచ్చు పెట్టాలని ప్లాన్ వేస్తుంది. వెంటనే బయటకు వెళ్లి.. కళ్యాణ్ ఆఫీస్ కు వెళ్లడం లేదు.. మళ్ళీ కవితలు మొదలు పెట్టాడు అని అనామికను రెచ్చగొడుతుంది.

publive-image

రుద్రాణి మాటలకు రెచ్చిపోయిన అనామిక మళ్ళీ ఇంట్లో పంచాయితీ పెడుతుంది. ఆఫీస్ కు ఎందుకు వెళ్లడం లేదు అని భర్తతో గొడవ పడుతుంది.

publive-image

అనామిక ప్రవర్తనతో విసిగిపోయిన కళ్యాణ్.. భర్తను అరెస్ట్ చేయించిన నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అడిగే హక్కు కూడా నీకు లేదు. ఇక నుంచి నాకు వచ్చిన, నచ్చిన పని మాత్రమే చేస్తాను. ఆఫీస్ కు వెళ్ళను అని తెగేసి చెప్తాడు.

publive-image

కళ్యాణ్ ఇలా మాట్లాడడంతో.. మరి ఆఫీస్ ఎవరు చూసుకుంటారు అని అపర్ణ ఫైర్ అవుతుంది. దీంతో కళ్యాణ్.. అది నా సమస్య కాదు, నీ సమస్య పెద్దమ్మా అని అపర్ణకు ఎదురు సమాధానం చెప్తాడు. కంపెనీని నడిపే సమర్థుడు అన్నయ్య ఒక్కడే అని తెలిసి కూడా పదవి నుంచి తప్పించావు. కంపెనీ గురించి మాట్లాడే ముందు మీరే ఒకసారి ఆలోచిస్తే మంచిది అని అపర్ణను నిలదీస్తాడు. రేపటి ఎపిసోడ్ లో కావ్య బిడ్డ తల్లిని కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

publive-image

Also Read: Mega Family vs Allu Arjun: మెగాఫ్యామిలీలో అల్లు అర్జున్ రచ్చ.. నాగబాబు ట్వీట్ సంచలనం.. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు