Brahmamudi Serial Today Episode : ఇంట్లో స్వప్న(Swapna) మోడలింగ్ పంచాయితీ తర్వాత అందరు లోపలికి వెళ్తారు. ఆ తర్వాత స్వప్న రూమ్ కి వెళ్లిన కావ్య(Kavya).. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ పని ఎందుకు మొదలు పెట్టావు అక్క అని స్వప్నను నిలదీస్తుంది. దీంతో స్వప్న.. నా భర్త, అత్త క్రెడిట్ కార్డు బిల్ కట్టాలని డబ్బులు అడిగితే ఏం పట్టనట్లు ఉన్నారు. అందుకే ఇలా మోడలింగ్ పేరుతో ఇంట్లో అందరి ముందు వాళ్ళ పరువు తీద్దామని అనుకున్నాను అని చెప్తుంది
మరో వైపు ఇలాగే ఇంట్లో రోజుకో గొడవ జరిగితే.. దుగ్గిరాల కుటుంబం ముక్కలైపోతుంది అని ఇందిరాదేవి(Indira Devi), సీతారామయ్య(Seetha Ramaiah) భయపడతారు. స్వప్న గొడవలో అర్థం ఉంది. కానీ ధాన్యలక్ష్మి ఎందుకు గొడవ చేస్తుంది. ఇవాళ సుభాష్ పై కూడా అరిచేసిందంటా. ఇలా చిన్న చిన్న గొడవలే రేపు పెద్ద గాలి వానలా మారుతాయి అని టెన్షన్ పడుతారు ఇందిరాదేవి, సీతారామయ్య.
కళ్యాణ్(Kalyan) ఒంటరిగా రూమ్ లో కవితలు రాసుకుంటూ ఉంటాడు. ఇంతలో అనామిక(Anamika) వస్తుంది. భార్య రాగానే కళ్యాణ్.. నేను బయట పడుకుంటానని చెప్పి వెళ్లిపోతుంటారు. దీంతో అనామిక అంటే నీకు ఇక్కడ అంత ఇబ్బందిగా ఉందా అని కళ్యాణ్ తో వాదిస్తుంది. ఇక్కడ మాత్రమే కాదు ఈ ఇల్లు ఒక జైలులా ఉంది. అర్థం చేసుకోలేని మనుషుల మధ్య ఉంటే జైల్లో ఉన్నట్లే అని భార్య మొహం చెప్పేసి వెళ్ళిపోతాడు కళ్యాణ్.
కొడుకు కళ్యాణ్ బయట పడుకోవడం గమనించిన ధాన్యలక్ష్మి వెళ్లి భర్తను తీసుకొని వస్తుంది. కళ్యాణ్ ఇలా బయట పడుకోవడం అపర్ణ అక్క చూస్తే నన్ను వెటకారం చేసి మాట్లాడుతుంది వెంటనే కళ్యాణ్ ను లోపలికి వెళ్ళమని చెప్పండి అని ప్రకాశంతో చెప్తుంది. దీంతో ప్రకాశం కొడుకు కాపురానికి ఏమైందని బాధ కంటే అవతలి వాళ్ళు ఏమంటారు అనేది నీకు ముఖ్యమైందా అని భార్యను తిడతాడు.
ప్రకాశం, ధాన్యలక్ష్మి సోఫాలో పడుకున్న కళ్యాణ్ దగ్గరకు వెళ్తారు. ఇలా బయట పడుకోవడం అందరు చూస్తే బాగోదు అని కళ్యాణ్ కు సర్ది చెప్తాడు ప్రకాశం. అమ్మ నాన్నలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని లోపలికి వెళ్తాడు కళ్యాణ్ .
మరో వైపు రాజ్ శ్వేతతో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. కాలికి గాయం అయ్యిందనే వంకతో.. కావ్య తన బావను అక్కడే వదిలేసేలా చేశాను ఇప్పుడు హ్యాపీ గా ఉంది అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కావ్య రాగానే ఫోన్ కట్ చేస్తాడు.
కావ్య డల్ ఉండడం గమనించిన రాజ్.. ఏమైంది మీ బావ రాలేదని ఫీల్ అవుతున్నావా అని వెటకారంగా మాట్లాడతాడు. దీంతో కావ్య అదేమీ లేదు మా అక్క గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది.
ఆ కావ్య వంట గదిలో కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లిన ఇందిరాదేవి.. మీ బావను వెంటనే రప్పించు లేదంటే మన ప్లాన్ అంతా పాడవుతుంది. తాను ఇక్కడ ఉంటేనే రాజ్ కు నీ పై ఉన్న ప్రేమ బయటపడుతుంది అని సలహా ఇస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read : Samantha : సమంతతో తిరుమలలో ప్రత్యక్షమైన ప్రీతం.. మరోసారి టాలీవుడ్ లో గుసగుసలు