Brahmamudi Serial: రాజ్ బిడ్డ కోసం కావ్య తిప్పలు.. అపర్ణకు అడ్డంగా దొరికిపోయిన కళ్యాణ్..!

అపర్ణ మాటను లెక్కచేయకుండా కావ్య, కళ్యాణ్ బయటకు వెళ్లి బాబు కోసం ఉగ్గు తీసుకొని వస్తారు. దీంతో కోడలు కావ్య, కళ్యాణ్ పై ఫైర్ అవుతుంది అపర్ణ. మరో వైపు తన కొడుకును తిట్టిందన్న కోపంతో అక్క అపర్ణను నిందిస్తుంది ధాన్యలక్ష్మి. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

Brahmamudi Serial: రాజ్ బిడ్డ కోసం కావ్య తిప్పలు.. అపర్ణకు అడ్డంగా దొరికిపోయిన కళ్యాణ్..!
New Update

Brahmamudi Serial: ఆకలితో తట్టుకోలేకపోతున్నా రుద్రాణి, అనామిక, రాహుల్, ధాన్యలక్ష్మి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఇంతలో డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొని వస్తాడు. కానీ ఇంటి బయట ప్రకాశం ఉండడంతో ఎక్కడ దొరికిపోతామేమో అని టెన్షన్ పడతారు. డెలివరీ బాయ్ ఇక్కడ రాహుల్ ఎవరని అడగడంతో.. మతిమరుపు ఉన్న రాహుల్ అలాంటి వారు ఇక్కడ ఎవరూ లేరు. ఆ ఫుడ్ నువ్వే తినేసేయ్ అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు.

publive-image
ప్రకాశం చేసిన పనికి రుద్రాణి, అనామిక, ధాన్యలక్ష్మీ, రాహుల్‌ షాక్ అవుతారు. హ్యాపీగా ఫుడ్ తిందామనుకుంటే ప్రకాశం ఇలా చేశారేంటీ అని ఆకలితో బాధపడతారు.

publive-image
మరో వైపు బాబు గట్టిగా ఏడుస్తుంటాడు. రాజ్ ఎంత ఊరుకోబెట్టిన అలాగే ఏడుస్తాడు. దీంతో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉంటాడు రాజ్. బాబుకు పాలు తాగించే ప్రయత్నం చేస్తాడు. అక్కడే ఉన్న కావ్య వాడి వయసుకు పాలు మాత్రం తాగితే సరిపోదు. ఉగ్గు తినిపించాలి అని చెప్తుంది. ఉగ్గా అంటే ఏంటీ అని ఆశ్చర్యంగా అడుగుతాడు రాజ్. మీ ఆకలి తీరితే సరిపోదు వాడి ఆకలి గురించి కూడా ముందే ఆలోచించాలి అని భర్తను నిందిస్తుంది.

publive-image
కావ్య అలా చెప్పడంతో ఇప్పుడేం చేయాలి అని అడుగుతాడు రాజ్. దీంతో ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్తుంది కావ్య. ఆ తర్వాత కళ్యాణ్, కావ్య ఇద్దరు కలిసి బయటకు వెళ్లి బాబు కోసం ఉగ్గు తీసుకొని వస్తారు.

publive-image
కళ్యాణ్, కావ్య బయటకు వెళ్లి రావడం ఇంట్లో అందరు చూస్తారు. అపర్ణకు అడ్డంగా దొరికిపోతారు. తన మాటను లెక్కచేయకుండా రాజ్ కు ఎందుకు సహాయం చేస్తున్నారని కావ్య, కళ్యాణ్ పై ఫైర్ అవుతుంది.

publive-image
అపర్ణ తన కొడుకును నిందించడంతో అక్క అపర్ణ పై రెచ్చిపోతుంది ధాన్యలక్ష్మి. నీ కొడుకు, మనవడు, కోడలు అందరు బాగానే ఉన్నారు మధ్యలో నా కొడుకును ఎందుకు నిందిస్తున్నావు అని అపర్ణతో వాదనకు దిగుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Ram Charan Birthday: రామ్ చరణ్ కోసం సురేఖ అదిరిపోయే గిఫ్ట్.. కొడుకు అంటే ఎంత ప్రేమో..!

#brahmamudi-serial #brahmamudi-today-episode
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe