Brahmamudi: ఇందిరాదేవి ప్లాన్ అదిరింది.. ఒకటైన కావ్య, రాజ్..! కనకానికి గుండెపోటు..!

భార్య కావ్యకు తన ప్రేమను ఎలా చెప్పాలని సతమతమవుతుంటాడు రాజ్. మరో వైపు రాజ్, కావ్యకు తెలియకుండా ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తుంది ఇందిరాదేవి. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi: ఇందిరాదేవి ప్లాన్ అదిరింది.. ఒకటైన కావ్య, రాజ్..! కనకానికి గుండెపోటు..!

Brahmamudi Serial: నేటి ఎపిసోడ్ లో కావ్య గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. భార్య పై ఉన్న ప్రేమను పైకి చెప్పలేకపోతున్న రాజ్ కావ్యను అలానే చూస్తూ ఉంటాడు. రాజ్ మనసులో ఏముందో అర్థం చేసుకున్న కావ్య ఏంటీ అలా చూస్తున్నారు అని రాజ్ ను ఆటపట్టిస్తుంది. ఇక రాజ్ మాత్రం ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని కావ్యకు ఎలా చెప్పాలి అని సతమతమవుతుంటాడు.

publive-image

మరో వైపు ఇందిరాదేవి కావ్య, రాజ్ కు తెలియకుండా ఇద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని అపర్ణతో కూడా డిస్కస్ చేస్తుంది. మరి ఈ విషయం వాళ్లకు తెలుసా అత్తయ్య అని ఇదిరాదేవిని అడుగుతుంది అపర్ణ. దానికి ఇందిరాదేవి వాళ్లకు తెలిస్తే తప్పించుకోవడానికి ట్రై చేస్తారు అందుకే చెప్పడం లేదు అని చెప్తుంది.

Brahmamudi Serial

బయట గార్డెన్ నుంచి రాజ్ ఇంట్లోకి వస్తుండగా ఇందిరాదేవి ఎదురుపడుతుంది. బయట నువ్వు వేసిన వెదవ వేషాలన్నీ చూసాను. ఇంకా ఎన్నాళ్ళు.. కావ్యను బాధపెడతావు. మనసులో ఉన్న ప్రేమను చూపించాలి కదా అని రాజ్ తో అంటుంది ఇందిరాదేవి.

Brahmamudi Serial

ఇక ఇందిరాదేవి మాటలు విన్న రాజ్ కావ్య గురించి గొప్పగా మాట్లాడతాడు. ఎప్పుడు కళావతి నా మనసు మార్చిందో నాకే తెలియదు. తాను అక్కర్లేదని మొహం మీదే చెప్పినా నా మనసు గెలుచుకుంటామని ఛాలెంజ్ చేసింది. జీవితంలో తనను కోడలిగా అంగీకరించను అని చెప్పిన మా అమ్మను కూడా తనవైపుకు తిప్పేసుకుంది. అలాంటి కావ్యను నేను భార్యగా అంగీకరించడం కాదు, తానే నన్ను తనే భర్తగా తీసుకుంటుందా అని ఆలోచిస్తున్నానని అంటాడు రాజ్.

publive-image

మరో వైపు అప్పు బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని అడుగుతుంది కనకం. ఇంత జరిగిన తర్వాత కూడా బయటకు ఎందుకు వెళ్తున్నావు అని అప్పు పై ఫైర్ అవుతుంది. దీంతో అప్పు నాకు పోలీస్ ఎగ్జామ్ ఉంది. నేను వెళ్ళాలి అని చెప్తుంది. ఇక కనకం ఎగ్జామ్ రాయడం అవసరమా అని అప్పును మందలిస్తుంది.

publive-image

అప్పు మాత్రం కనకం మాటలు ఏ మాత్రం లెక్కచేయదు. అమ్మాయి అంటే పెళ్లి ఒక్కటేనా. ముందు నేను పోలీస్ అవ్వాలని అంటుంది. దీంతో కనకం నువ్వు పెళ్లి చేసుకొన్నన్న ప్రతీ సారి నాకు గుండెపోటు వచ్చేలా ఉంది అని బాధపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రాజ్ కావ్యకు తన ప్రేమను చెప్తాడు.

publive-image

Also Read: Salman-Rajinikanth: సల్మాన్-రజనీకాంత్ సూపర్ కాంబో.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే!

Advertisment
Advertisment
తాజా కథనాలు