Salman-Rajinikanth: సల్మాన్-రజనీకాంత్ సూపర్ కాంబో.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు వార్తలు వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా బాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Salman-Rajinikanth: సల్మాన్-రజనీకాంత్ సూపర్ కాంబో.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే!

Salman - Rajinikanth: ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ హోస్ట్ గా బ్రేక్ తీసుకున్న సల్మాన్ ప్రస్తుతం సినిమాలపై ద్రుష్టి పెట్టడం ప్రారంభించాడు. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సికందర్‌ మూవీ (Sikandar) చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సికిందర్ లో సల్మాన్ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) కనిపించనుంది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

publive-image

అట్లీ సినిమాలో రజనీకాంత్ , సల్మాన్

ఇది ఇలా ఉంటే ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. అయితే తాజాగా దీనికి మించిన సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. సల్మాన్, అట్లీ కాంబోలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా బాగమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ (Sun Pictures) నిర్మిస్తోంది. గత రెండేళ్లుగా దర్శకుడు అట్లీ , సల్మాన్ ఖాన్‌ మధ్య సినిమా గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇక ఈ ప్రాజెక్ట్‌ లో రజనీకాంత్‌ కూడా బాగమైనట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read: Darling : ది మ్యాడ్‌మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్.. డార్లింగ్ రిలీజ్ ఆరోజే..? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు