Brahmamudi: కొడుకు చెంప పగలగొట్టిన ఇందిరాదేవి.. ఆత్మహత్య చేసుకున్న సుభాష్..!

సుభాష్ చేసిన తప్పు కారణంగా అపర్ణ చావు బ్రతుకుల్లో ఉండడంతో తట్టుకోలేకపోయిన ఇందిరాదేవి కొడుకు చెంపలు వాయిస్తుంది. కోడలు అపర్ణ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరో వైపు భార్యకు అన్యాయం చేశాననే బాధతో సుభాష్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు సుభాష్. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Brahmamudi: కొడుకు చెంప పగలగొట్టిన ఇందిరాదేవి.. ఆత్మహత్య చేసుకున్న సుభాష్..!

Brahmamudi: భర్త సుభాష్ తప్పు చేశాడని తెలియడంతో తట్టుకోలేకపోయిన అపర్ణకు గుండెపోటు వస్తుంది. దీంతో వెంటనే ఆమెకు హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఇక ఇలా జరగడంతో ఇంట్లో అందరు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మి దీని అంతటికీ కారణమైన ఆ దొంగ మాయను పోలీసులకు పట్టించాలని అంటుంది.   publive-image ఇక మాయ గురించి అంతా తెలిసిన రుద్రాణి.. మెల్లిగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు పోలీసులకు పట్టించేదాకా అది ఉంటుందా. ఎప్ప్పుడో పారిపోయి ఉంటుంది అని ధాన్యలక్ష్మిని డైవర్ట్ చేస్తుంది.

publive-image

మరో వైపు కొడుకు చేసిన తప్పును తట్టుకోలేకపోతున్న ఇందిరాదేవి.. సుభాష్ చెంప పగలగొడుతుంది. అందరు ఆపడానికి ప్రయత్నించినా కొడుతూనే ఉంటుంది. వీడికి ఒక్క చెంప దెబ్బ సరిపోదు. అసలు వీడు మనిషేనా.. ఛీ.. దేవతలాంటి భార్యకు ఎలా ద్రోహం చేయాలనిపించిందిరా అని కొడుకు పై ఫైర్ అవుతుంది ఇందిరాదేవి. చావు బ్రతుకుల్లో ఉన్న నా కోడలికి ఏదైనా జరిగితే.. నువ్వు ఇక ఇంట్లో అడుగు పెట్టావు అని సుభాష్ కు వార్నింగ్ ఇస్తుంది.

publive-image

ఇంతలో డాక్టర్ వస్తుంది. డాక్టర్ రాగానే.. రాజ్ అపర్ణ పరిస్థితి ఎలా ఉందని అడుగుతాడు. ఆమెకు వచ్చింది మైల్డ్ హార్ట్ ఎటాక్ కాదు. మ్యాసివ్ స్ట్రోక్. కండిషన్ సీరియస్ అని చెబుతుంది. దీంతో అందరు షాకవుతారు.

publive-image

మరో వైపు తల్లి పరిస్థితిని చూసి రాజ్ బాధపడుతూ ఉంటాడు. కావ్య ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాజ్ మాత్రం కావ్య పై ఫైర్ అవుతాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా. నువ్వు దొంగ మాయను తీసుకురావడం వల్లే ఇదంతా జరిగింది. మా అమ్మకు ఏదైనా జరిగితే.. జీవితంలో క్షమించను అని కావ్యకు పెద్ద షాకిస్తాడు. దీంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.

publive-image

భార్య అపర్ణకు చేసిన ద్రోహాన్ని తలుచుకొని కుమిలిపోతాడు సుభాష్. ఒక వైపు తల్లి ఇందిరాదేవి మాటలు, మరో వైపు భార్య అపర్ణ పరిస్థిని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. హాస్పిటల్ లో నర్స్ చేతిలో ఉన్న కత్తి తీసుకొని చేయి కోసుకుంటాడు. దీంతో నర్స్ గట్టిగా అరుస్తుంది. వెంటనే అక్కడికి వచ్చిన రాజ్, కావ్య సుభాష్ ను చూసి కంగారు పడతారు.

publive-image

కావ్య, రాజ్ సుభాష్ ను ఆపడానికి ప్రయత్నిస్తారు. అయినా వినకుండా చేయి కోసుకుంటాడు సుభాష్. నేను బ్రతకను.. నా వల్లే మీ అమ్మకు ఈ పరిస్థితి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీంతో రాజ్ తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ తో చేయికి కట్టు కట్టిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Yevam Movie: యేవమ్‌ ఫస్ట్ లిరికల్ వీడియో ‘ఒగ్గు కథ’ రిలీజ్

Advertisment
తాజా కథనాలు